హైదరాబాద్ లో కుండపోత వర్షం, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్-hyderabad heavy rains lashed city caused widespread traffic jams ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైదరాబాద్ లో కుండపోత వర్షం, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ లో కుండపోత వర్షం, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఖైరతాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో రహదారులు జలమయం అయ్యాయి.

హైదరాబాద్ లో కుండపోత వర్షం, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. శనివారం సాయంత్రం నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఖైరతాబాద్‌ సహా పలుచోట్ల వర్షం కురిసింది. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. బషీర్ బాగ్, లక్డీకపూల్, లిబర్టీ, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్ లో భారీ వర్షం కురిసింది.

వాహనదారులకు అవస్థలు

భారీ వర్షంతో రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో 3 గంటలపాటు నగరాన్ని ఈ కుండపోత వర్షం కొనసాగనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, మ్యాన్ హోల్స్ ప్రాంతాల్లో సురక్షితంగా ఉండాలని సూచించారు.

నగరంలో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో నగరంలో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

మరో నాలుగు రోజులు వర్షాలు

తెలంగాణలో గత కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఇదిలా ఉంటే వచ్చే వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.

తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు లేదా ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చని పేర్కొంది.

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

నేడు నిర్మల్, నిజామాబాజ్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. 40- 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది.

వీటితో పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం