Hyderabad Car Fire Incident : కారులో మంటలు, సజీవ దహనం ఘటనలో బిగ్ ట్విస్ట్-ప్రేమ జంట ఆత్మహత్య-hyderabad ghanpur road accident car catches fire two dead burnt alive ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Car Fire Incident : కారులో మంటలు, సజీవ దహనం ఘటనలో బిగ్ ట్విస్ట్-ప్రేమ జంట ఆత్మహత్య

Hyderabad Car Fire Incident : కారులో మంటలు, సజీవ దహనం ఘటనలో బిగ్ ట్విస్ట్-ప్రేమ జంట ఆత్మహత్య

Bandaru Satyaprasad HT Telugu
Jan 06, 2025 10:49 PM IST

Hyderabad Car Accident : హైదరబాద్ లో విషాదం చోటుచేసుకుంది. ఘన్ పూర్ సర్వీస్ రోడ్డులో కారులో మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనం అయ్యారు. అయితే ఇది ప్రమాదం కాదని ప్రేమ జంట ఆత్మహత్య అని పోలీసులు నిర్థారించారు.

కారులో మంటలు, సజీవ దహనం ఘటనలో బిగ్ ట్విస్ట్-ప్రేమ జంట ఆత్మహత్య
కారులో మంటలు, సజీవ దహనం ఘటనలో బిగ్ ట్విస్ట్-ప్రేమ జంట ఆత్మహత్య

Hyderabad Car Accident : హైదరాబాద్ లో విషాద ఘటన జరిగింది. ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘన్ పూర్ సర్వీసు రోడ్డులో కారులో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సజీవదహనం అయ్యారు. సంఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. అయితే ఇది ప్రమాదం అని భావించగా… ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్థారించారు.

yearly horoscope entry point

కారులో మంటలు చెలరేగి అంతలోనే భారీగా వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్న డ్రైవర్‌ ఫుట్‌పాత్‌పై పడి కాలిపోయాడు. ముందు సీట్లో కూర్చున్న మరో వ్యక్తి కారులోనే సజీవ దహనం అయ్యారు. ప్రమాదానికి గురైన కారుని మేడిపల్లిలోని ఓ ట్రావెల్‌ ఏజెన్సీ నుంచి సెల్ఫ్‌ డ్రైవ్‌ కోసం అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలికి చేరుకున్న మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, ఘట్ కేసర్ సీఐ పరశురామ్‌ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.

బిగ్ ట్విస్ట్

కారులో మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనమైన కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇది ప్రమాదం కాదని, ఆత్మహత్య అని పోలీసులు నిర్థారించారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట కారులో నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు యాదాద్రి జిల్లా జమ్ములపేటకు చెందిన శ్రీరామ్, మేడ్చల్ జిల్లా నారపల్లికి చెందిన లిఖితగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు ముందు తాము చనిపోతున్నట్లు ప్రేమజంట వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు.

కారులో మంటలు ఘటనపై పోలీసులు వివరాలు అందించారు. శ్రీరామ్ (26), లిఖిత (16) గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఘట్‌కేసర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో లిఖిత ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. శ్రీరామ్ ఘట్‌కేసర్ నారపల్లిలో సైకిల్ షాప్ నడుపుతున్నాడు. వీరిద్దరూ రహస్యంగా ఉన్నప్పుడు చూసిన కొందరు వ్యక్తులు శ్రీరామ్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వీరి నుంచి డబ్బులు వసూలు చేయడమే కాకుండా మానసికంగా వేధించినట్లు తెలుస్తోంది.

ఆత్మహత్యకు ముందు శ్రీరామ్ తన సోదరికి ఫోన్ చేసి...తామిద్దరం చనిపోతున్నట్లు తెలిపాడు. అనంతరం ఘట్‌కేసర్‌లోని ఘనాపూర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు దగ్గర కారులో సూసైడ్ చేసుకున్నారు. పోలీసులకు 3 పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేస్తున్నారు. శ్రీరామ్ నడిపిస్తున్న సైకిల్ షాపు పక్కనే లిఖిత నివాసం ఉన్నట్లు తెలుస్తోంది. మృతులిద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Whats_app_banner

సంబంధిత కథనం