Wines Shops Close : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, మూడ్రోజుల పాటు వైన్ షాపులు బంద్-hyderabad ec orders to close wine shops may 11 to 13th and june 4th on general elections polling counting ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Wines Shops Close : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, మూడ్రోజుల పాటు వైన్ షాపులు బంద్

Wines Shops Close : మందుబాబులకు బ్యాడ్ న్యూస్, మూడ్రోజుల పాటు వైన్ షాపులు బంద్

Bandaru Satyaprasad HT Telugu
Published May 08, 2024 08:30 PM IST

Wines Shops Close : లోక్ సభ ఎన్నికల వేళ మందుబాబుకు ఈసీ షాక్ ఇచ్చింది. మూడ్రోజుల పాటు మద్యం షాపులు మూసివేయాలని ఆదేశించింది. మే 11వ సాయంత్రం ఆరు గంటల నుంచి 48 గంటల పాటు, అలాగే జూన్ 4న వైన్ షాపులు బంద్ కానున్నాయి.

మందుబాబులకు బ్యాడ్ న్యూస్
మందుబాబులకు బ్యాడ్ న్యూస్

Wines Shops Close : ఎన్నికలంటే మందుబాబులకు పండుగే. పార్టీలతో సంబంధంలేకుండా... మద్యం ఏరులై పారిస్తుంటారు. మత్తులో తేలుతున్న మందుబాబులకు ఓ బ్యాడ్ న్యూస్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మందుబాబులకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పోలింగ్ నేపథ్యంలో మూడ్రోజుల పాటు వైన్ షాపులు మూసివేయాలని ఆదేశించింది. మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ జరిగే మే 13వ తేదీ సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు మూసివేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు రోజులను డ్రై డేగా ప్రకటించింది. అలాగే ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4 కూడా మద్యం షాపులు మూసివేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.

ఈసీ ఆదేశాలు

పర్వదినాలు, పండుగలు, ఎన్నికల కౌంటింగ్, పోలింగ్ జరిగినప్పుడు ఎలాంటి అవాఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రంలో మద్యం షాపులు మూసివేస్తుంటారు. అలాగే లోక్ సభ ఎన్నికల పోలింగ్ సమయంలో కూడా ఎలాంటి వివాదాలు, గొడవలకు తావు లేకుండా ఈసీ ఆదేశాలు మేరకు పోలీసుశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మూడ్రోజుల పాటు మద్యం షాపులు, బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడనున్నాయి. పోలింగ్ డే నాడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా, భద్రత పరంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా వైన్ షాపులు బంద్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు

తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఈసీ పూర్తి ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 35809 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేసినట్లు సీఈవో వికాస్ రాజ్ ప్రకటించారు. అలాగా 23,500 మంది ఉద్యోగులను ఎన్నికల సిబ్బందిగా నియమించినట్లు తెలిపారు. 155 కంపెనీల కేంద్ర బలగాలను ఎన్నికల భద్రతకు వినియోగిస్తున్నామన్నారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీ పడుతున్నట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. సికింద్రాబాద్ లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్ లో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్లు వెల్లడించారు. మొత్తం 285 మంది స్వతంత్ర అభ్యర్థులు లోక్ సభ బరిలో ఉన్నారని తెలిపారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగాఉన్న దృష్ట్యా 7 స్థానాల్లో 3 ఈవీఎంలు, 9 స్థానాల్లో 2 ఈవీఎంలు ఉపయోగించనున్నట్లు తెలిపారు.

Whats_app_banner