Hyderabad Water Supply Disruption : హైదరాబాద్ వాసులకు అలర్ట్, ఈ నెల 30న మంచి నీటి సరఫరాకు అంతరాయం-hyderabad drinking water supply disruption in bhel patancheru areas due to works on july 30th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Water Supply Disruption : హైదరాబాద్ వాసులకు అలర్ట్, ఈ నెల 30న మంచి నీటి సరఫరాకు అంతరాయం

Hyderabad Water Supply Disruption : హైదరాబాద్ వాసులకు అలర్ట్, ఈ నెల 30న మంచి నీటి సరఫరాకు అంతరాయం

Hyderabad Water Supply Disruption : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 30వ తేదీ ఉదయం 6 నుంచి 31వ తేదీ ఉదయం 6 గంటల వరకు మంజీరా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని వాటర్ బోర్డు ప్రకటించింది.

హైదరాబాద్ వాసులకు అలర్ట్, ఈ నెల 30న మంచి నీటి సరఫరాకు అంతరాయం

Hyderabad Water Supply Disruption : జీహెచ్ఎంసీ పరిధిలో మంజీరా నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని హైదరాబాద్ వాటర్ బోర్డు ప్రకటించింది. పటాన్‌చెరులోని జంక్షన్‌ పనుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో మంచి నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వాటర్‌బోర్డు పేర్తొంది. ఈనెల 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 31వ తేదీ ఉదయం 6 గంటల వరకు తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరమ్మతు పనుల కారణంగా కొన్ని ప్రాంతాలకు పూర్తిగా, మరికొన్ని ప్రాంతాలకు పాక్షికంగా తాగునీటి సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

బీహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిప్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, పటాన్‌చెరు ఇండస్ర్టియల్‌ ఏరియా, పటాన్‌చెరు పట్టణం, రామచంద్రాపురం, అశోక్‌నగర్‌, జ్యోతినగర్‌, లింగంపల్లి, చందానగర్‌, గంగారం, మదీనాగూడ, హఫీజ్‌పేట, డోయెన్స్‌ కాలనీ, ఎస్‌బీఐ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రాంతాలకు మంచి నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వాటర్ బోర్డు తెలిపింది.

వాటర్ పైపు లైన్ మరమ్మతుల కారణంగా నీటి సరఫరాకు అంతరాయం కలిగిందని, ప్రజలు సహకరించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) తెలిపింది. కొన్ని ప్రాంతాలకు పూర్తిగా, మరికొన్ని ప్రాంతాలకు పాక్షికంగా మంచి నీటి సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

నేడు, రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ లో బోనాల పండుగ సందర్భంగా నేడు, రేపు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. లాల్ దర్వాజా నుంచి మహాంకాళి లాల్ దర్వాజా టెంపుల్ రోడ్డు వైపు వచ్చే వాహనాలకు, చాంద్రాయణగుట్ట, కందికల్‌ గేట్‌ ఉప్పుగూడ నుంచి వచ్చే వాహనాలకు అనుమతి లేదు. హిమ్మత్‌పురా, షంషీర్‌గంజ్‌ వైపు నుంచి లాల్ దర్వాజాకు వచ్చే వాహనాలను నాగుల చింత, గౌలిపురా వైపు మళ్లించారు.

సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మహబూబ్ నగర్ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే వాహనాలను ఇంజిన్ బౌలి వద్ద జహానుమా, గోశాల, తాడ్ బాన్ లేదా గోశాల మిస్రీగంజ్, ఖిల్వత్ వైపు మళ్లిస్తారు. ఇంజిన్ బౌలి నుంచి వచ్చే ట్రాఫిక్ షంషీర్ గంజ్ వద్ద మళ్లిస్తారు. పంచ మొహల్లా చార్మినార్ నుంచి ట్రాఫిక్ నాగుల్ చింత వైపు అనుమతించరు. ఆ వాహనాలను హరిబౌలి, ఓల్గా హోటల్, మిస్రిగంజ్ వైపు మళ్లిస్తారు. చాదర్‌ఘాట్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సాలార్‌జంగ్ మ్యూజియం రోడ్డు వైపు అనుమతించరు. ట్రాఫిక్ ను ఎస్జే రోటరీ వద్ద పురాణి హవేలీ రోడ్డు, శివాజీ బ్రిడ్జ్, చాదర్‌ఘాట్ వైపు మళ్లిస్తారు. మీర్‌చౌక్, మొఘల్‌పురా నుంచి వచ్చే ట్రాఫిక్‌ను హరిబౌలి వైపు అనుమతించరు. మీర్ కా దైరా వద్ద మొఘల్‌పురా వాటర్ ట్యాంక్ వైపు మళ్లిస్తారు. ఖిల్వత్/మూసబౌలి నుంచి వచ్చే ట్రాఫిక్ లాడ్ బజార్ వైపు అనుమతించరు. మోతిగల్లి టీ జంక్షన్ వద్ద ఖిల్వత్ ప్లే గ్రౌండ్, మూసా బౌలి వైపు మళ్లిస్తారు. ఖిల్వత్ ప్లే గ్రౌండ్ నుంచి వచ్చే ట్రాఫిక్ హిమ్మత్‌పురా వైపు అనుమతించరు. ఓల్గా జంక్షన్ వద్ద ఫతే దర్వాజా, మిస్రిగంజ్ వైపు మళ్లిస్తారు.

సంబంధిత కథనం