Hyderabad Crime : ప్రేమ పేరుతో సోదరికి వేధించిన యువకుడు, మందు పార్టీ ఇచ్చి మర్డర్ చేసిన సోదరుడు-hyderabad crime news in telugu youth murdered man who harasses sister love matter ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyderabad Crime News In Telugu Youth Murdered Man Who Harasses Sister Love Matter

Hyderabad Crime : ప్రేమ పేరుతో సోదరికి వేధించిన యువకుడు, మందు పార్టీ ఇచ్చి మర్డర్ చేసిన సోదరుడు

HT Telugu Desk HT Telugu
Mar 10, 2024 05:14 PM IST

Hyderabad Crime : ప్రేమ పేరుతో సోదరిని వేధించిన ఓ యువకుడిని ప్లాన్ ప్రకారం హత్య చేశాడో యువకుడు. హైదరాబాద్ మణికొండలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మందు పార్టీ ఇచ్చి మర్డర్ చేసిన సోదరుడు
మందు పార్టీ ఇచ్చి మర్డర్ చేసిన సోదరుడు

Hyderabad Crime : మద్యం తాగిన తర్వాత తన సోదరిని అసభ్యంగా తిట్టాడని ఓ యువకుడిని మరో యువకుడు కర్రతో తలపై బాది హత్య చేసిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం....నగరంలోని (Hyderabad Crime)టోలీచౌక్ ప్రాంతానికి చెందిన విశాల్ సింగ్ (36) మణికొండకు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. వేధింపుల నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు విశాల్ సింగ్ ను పలుమార్లు మందలించడంతో ఏడాది కాలంగా ప్రియురాలికి దూరంగా ఉంటున్నాడు. తన సోదరిని వేధించిన విశాల్ సింగ్ పై కక్ష పెట్టుకున్న యువతి సోదరుడు శ్యామ్ తన బంధువైన అర్జున్ సింగ్ ద్వారా విశాల్ సింగ్ ను మణికొండకు పిలిపించాడు. అర్ధరాత్రి మద్యం తాగిన తర్వాత సదరు యువతి ప్రస్తావన రావడంతో విశాల్ సింగ్ ఆమెను అసభ్యకరంగా తిట్టాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన శ్యామ్ కర్రతో విశాల్ తలపై పలు మార్లు కొట్టడంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో శ్యామ్ స్నేహితులు హుటాహుటిన విశాల్ సింగ్ ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విశాల్ సింగ్ మరణించాడు. యువతి సోదరుడు శ్యామ్ అలియాస్ షాను, అర్జున్, సుమన్, రాజేష్ అరుణ్ తో పాటు మరి కొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు అంతా పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం రెండు ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

పాత కక్షలతో రౌడీ షీటర్ దారుణ హత్య

రౌడీషీటర్(Rowdy Sheeter Murder) ను గొంతు కోసి దారుణంగా హత్య చేసిన సంఘటన పహాడ్ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....నగరంలోని కాలా పత్తర్ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ మొహమ్మద్ ఉస్మాన్ (36) ఏడాదికాలంగా పహాడ్ షరీఫ్ ఉమర్ కాలనీలోని దర్గాలో నివాసం ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం దర్గా నుంచి ఒకేసారి పెద్ద ఎత్తున కేకలు వినిపించడంతో స్థానికులు దర్గా లోపలకి ప్రవేశించి చూడగా ....రక్తపు మడుగులో ఉస్మాన్ ఉన్నాడు. కాగా దర్గా నుంచి ఇద్దరు దుండగులు పారిపోవడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే లోపే ఉస్మాన్ మృతి చెందాడు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలను రప్పించి నిందితుల కోసం గాలించారు. మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి, పహాడ్ షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఉస్మాన్ ను తీవ్రంగా కొట్టి గొంతు కోసినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు పాత కక్షలే కారణమాని పోలీసులు భావిస్తున్నారు. అయితే 2009 -11 మధ్య కాలంలో మృతుడు ఉస్మాన్ పై చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెదిరింపులు, దోపిడీ, దాడి హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి.

వేరువేరు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

హైదరాబాద్ నగరంలోని బండ్లగూడకు చెందిన మల్లేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం కొమరవెల్లి మల్లన్న దర్శనం చేసుకునేందుకు ఆటలో బయలుదేరారు. మేడ్చల్ చెక్ పోస్టు నుంచి కిష్టాపూర్ రోడ్డులో వెళ్తున్న వీరి ఆటో హెచ్.పి పెట్రోల్ బంక్ వద్ద ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న పిల్లలను ఢీ కొట్టింది. ఆటో నడుపుతున్న మల్లేష్ అక్కడికక్కడ మరణించగా కుటుంబ సభ్యులు ఐదుగురు గాయాలయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మేడ్చల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు.

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మృతి చెందిన సంఘటన పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఏ రాజు తెలిపిన వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి తూలుతూ వచ్చి అన్నోజిగూడలోని జాతీయ రహదారిపైన పడుకున్నాడు. అటువైపు వెళుతున్న వాహనదారులు గమనించి అతని రోడ్డు పక్కన పడుకోబెట్టారు. కొద్దిసేపటి తర్వాత అతను మేల్కొని మళ్లీ జాతీయ రహదారిపై వచ్చి పడుకున్నాడు. ఆ సమయంలో వేగంగా వెళుతున్న కారు ఢీకొనడంతో అతను మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

IPL_Entry_Point

సంబంధిత కథనం