Student Suicide : ఐ లవ్ యూ అమ్మా నాన్న.. ఈ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నా-hyderabad crime news 10th class student committed suicide in miyapur due to stress ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Hyderabad Crime News 10th Class Student Committed Suicide In Miyapur Due To Stress

Student Suicide : ఐ లవ్ యూ అమ్మా నాన్న.. ఈ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నా

విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఆత్మహత్య

Hyderabad Crime News : ఇటీవలి కాలంలో విద్యార్థులు కాస్త ఒత్తిడి పెరిగినా తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఓ టెన్త్ క్లాస్ విద్యార్థిని సైతం.. ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థుల ఆత్మహత్య(Suicide)లు ఎక్కువైపోతున్నాయి. తాజాగా హైదరాబాద్(Hyderabad) మియాపూర్ లోనూ ఓ విద్యార్థి స్ట్రెస్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే విద్యార్థిని తల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే..

ట్రెండింగ్ వార్తలు

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాయుడు వెంకటేశ్వర్లు కుటుంబం కేవీఆర్‌ టవర్స్‌లో ఉంటున్నారు. వాళ్ల కుమార్తె సంజన(14) పటాన్‌చెరు బీరంగూడలోని అకడమిక్‌ పబ్లిక్‌ స్కూల్‌లో టెన్స్ క్లాస్(10th Class) చదువుతోంది. తండ్రి ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు. తల్లి గవర్నమెంట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.

శుక్రవారం రోజున సంజన పాఠశాల(School)కు వెళ్లింది. సాయంత్రం ఐదు గంటలకు తిరిగి ఇంటికి వచ్చింది. రావడంతోనే.. బెడ్ రూమ్ లోకి వెళ్లింది. గడియ పెట్టుకుంది. ఒంట్లో బాగాలేదేమోనని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఎంతసేపటికి సంజన బయటకు రాలేదు. దీంతో తల్లి శిరీష, సోదరుడు మోహిత్ లకు అనుమానం వచ్చింది. ఏమైందోనని వెళ్లి తలుపు కొట్టారు. అయినా లోపలి నుంచి ఎలాంటి చప్పుడు లేదు.

ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితిలోకి కుటుంబ సభ్యులు వెళ్లారు. వెంటనే తలుపులు బద్దలు కొట్టారు. లోపల చూడగా.. సంజన ఫ్యాన్ కు ఉరివేసుకుని.. కనిపించింది. కిందకు దించి.. ఆసుపత్రి(Hospital)కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అమ్మాయి మృతిచెందిందని వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

అయితే చనిపోయే ముందు సంజన సూసైడ్ నోట్(Suicide Note) రాసింది. అందులో హాయ్ అమ్మా.. నాన్న.. మోహిత్ నేను అసలు ఈ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి.. ఐ లవ్ యూ.. అని రాసి పెట్టి సూసైడ్ చేసుకుంది. ఒత్తిడి తట్టుకోలేక.. ఇలా సంజన చనిపోయిందని తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.