అంబర్ పేట 'న్యూడ్ వీడియోల కేసు' - దంపతులు అరెస్ట్-hyderabad couple arrested for running paid live sex videos on social media sent to judicial remand ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  అంబర్ పేట 'న్యూడ్ వీడియోల కేసు' - దంపతులు అరెస్ట్

అంబర్ పేట 'న్యూడ్ వీడియోల కేసు' - దంపతులు అరెస్ట్

హైదరాబాద్ లోని అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూడ్ వీడియోల వ్యాపార వ్యవహారం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ కేసులోని దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను

న్యూడ్ వీడియోల వ్యాపారం - దంపతులు అరెస్ట్ (image source pixels)

తమ న్యూడ్ వీడియోలతో సరికొత్త రకం దందాకు తెరలేపిన దంపతులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి… రిమాండ్ కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

సోషల్ మీడియా వెబ్ సైట్లతో పాటు లైవ్ లింక్స్ ద్వారా లైవ్ న్యూడ్ వీడియోలను షేర్ చేస్తున్న దంపతులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లికార్జున్ నగర్ లో వెలుగు చసింది.

వృత్తిరీత్యా కారు డ్రైవర్ అయిన భర్త (41 ఏళ్లు) అతని భార్య(37 ఏళ్లు) వారి న్యూడ్ వీడియోలను చిత్రీకరించుకునేవారు. అయితే వారి ఫేసులు కనిపించకుండా మాస్క్ లు ధరించేవారు. చిత్రీకరించిన కంటెంట్ ను చూడటానికి… డబ్బు చెల్లించిన వినియోగదారులకు యాక్సెస్ లింక్లను షేర్ చేసేవారు.

అశ్లీల కంటెంట్ ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు పోలీసులకు పక్కాగా సమాచారం అందింది. ప్రత్యేకంగా ఓ ఆపరేషన్ ద్వారా… వీరి వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. ఈ దందాకు కేంద్రంగా ఉన్న ఇంటిని గుర్తించి… జూన్ 26న దంపతులను అరెస్టు చేసినట్లు కాచిగూడ ఏసీపీ వై. హరీశ్ కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని కోణాల్లో విచారిస్తున్నారు.

సదరు దంపతులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. 'స్వీటీ తెలుగు కపుల్ 2027' అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఖాతాను క్రియేట్ చేశారు. ఈ పేరు మీదనే వారి దందాను సాగించటం మొదలుపెట్టినట్లు తేలింది.

ముందస్తు ప్లాన్ లో భాగంగా… వారి న్యూడ్ వీడియోలను క్లిప్పింగులుగా కట్ చేసి పోస్ట్ చేసేవారు. వీటి ద్వారా జనాలను ఆకర్షించే ప్రయత్నాలు షురూ చేశారు. పూర్తి వీడియో కావాలంటే నేరుగా మెసేజ్ చేయాలంటూ సూచనలు ఇచ్చేవారు. వీరిని అనుసరించి… సదరు నెంబర్లను ఆశ్రయించే వారికి రేట్లు చెప్పేవారు.

రికార్డ్ చేసిన వీడియో క్లిప్‌ కావాలంటే రూ.500గా నిర్ణయించినట్లు తెలిసింది. అంతేకాకుండా… లైవ్ స్ట్రీమింగ్ వీక్షించేందుకు రూ.2000 చెల్లించాలని బేరం పెట్టేవారు. ఇలా వీడియోలు, లింక్ లు పంపుతూ డబ్బులను అర్జిస్తున్నారు. గత కొద్ది నెలలుగా ఈ వ్యవహారం సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం కాస్త…టాస్ఖ్ ఫోర్స్ పోలీసుల దృష్టికి చేరటంతో… రంగంలోకి దిగారు. పక్కా ఆపరేషన్ నిర్వహించి… దంపతుల జాడను కనిపెట్టారు.

నేరుగా అక్కడికి చేరుకుని వీరి దందా వ్యవహారం గురించి పూర్తి తెలుసుకున్నారు. ఇంట్లో ఉన్న కొన్ని కెమెరాలు, లైటింగ్ పరికరాలు, కంప్యూటర్ తో పాటు హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి… దర్యాప్తు చేస్తున్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.