CM Revanth Reddy : టీవీ సీరియల్ లా లిక్కర్ స్కామ్, కవిత అరెస్ట్ ఎలక్షన్ స్టంట్- సీఎం రేవంత్ రెడ్డి-hyderabad cm revanth reddy says kavitha arrest election stunt brs bjp plan benefit in lok sabha election ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : టీవీ సీరియల్ లా లిక్కర్ స్కామ్, కవిత అరెస్ట్ ఎలక్షన్ స్టంట్- సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : టీవీ సీరియల్ లా లిక్కర్ స్కామ్, కవిత అరెస్ట్ ఎలక్షన్ స్టంట్- సీఎం రేవంత్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Mar 16, 2024 07:50 PM IST

CM Revanth Reddy : 100 రోజుల కాంగ్రెస్, ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మార్పు మొదలైందన్నారు. కవిత అరెస్టు ఎలక్షన్ స్టంట్ అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : 100 రోజుల కాంగ్రెస్ పాలన(Congress Govt) నాకు పూర్తి సంతృప్తినిచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వందరోజుల్లో ప్రతి నిమిషం ఆరు గ్యారంటీల అమలుకు కృషి చేశామన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)... కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారని ఆరోపించారు. గత పాలనలో చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుతూ ముందుకు వెళుతున్నామన్నారు. ముందు ముందు ఇంకా బాధ్యతతో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఆరు గ్యారంటీలను(Six Guarantees) మరింత సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలను భర్తీ చేసి చరిత్ర సృష్టించామన్నారు. నిరుద్యోగులకు ఒక విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశామన్నారు. ప్రతీ నెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు వచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజా భవన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. సచివాలయం నిషేధిత ప్రదేశంలా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో సచివాలయంలోకి అందరికీ ప్రవేశం కల్పించే స్వేచ్ఛ ఇచ్చామన్నారు.

మార్పు మొదలైంది

"మేం పాలకులం కాదు.. ప్రజా సేవకులం అని ప్రజలకు తేల్చి చెప్పాం.ప్రజా సంఘాలతో ప్రభుత్వ నిర్ణయాలపై సలహాలు స్వీకరించాం. ఈ ప్రభుత్వంలో అందరినీ భాగస్వాములను చేస్తున్నాం. మార్పు మొదలైంది.. మార్పు జరుగుతోంది అని ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నాం. విభజన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటున్నాం. తెలంగాణ (Telangana)హక్కుల సాధన కోసం ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తున్నాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సంప్రదింపులు జరుపుతున్నాం. కేంద్రంతో, పక్క రాష్ట్రాలతో గిల్లికజ్జాలు పెట్టుకోవడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం. జయజయహే తెలంగాణ గీతాన్ని(TG Song) రాష్ట్ర గీతంగా ఆమోదించుకున్నాం. తెలంగాణ అభివృద్ధికి మా మంత్రులు, ఎమ్మెల్యేలు కష్టపడి పని చేస్తున్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి వైబ్రంట్ తెలంగాణ-2050 మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం"- సీఎం రేవంత్ రెడ్డి

టీవీ సీరియల్ లా లిక్కర్ స్కామ్

కవిత అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy on Kavitha Arrest) స్పందించారు. లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)వ్యవహారం టీవీ సీరియల్ ఎపిసోడ్స్ లా సాగుతోందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్(Election Notification) కు 24 గంటల ముందు కవితను అరెస్టు చేశారన్నారు. కవిత అరెస్టు ఎన్నికల స్టంట్ లా ఉందన్నారు. సానుభూతితో బీఆర్ఎస్.. అరెస్టు చర్యలతో బీజేపీ ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయన్నారు. కవితను అరెస్టు (Kavith Arrest)చేసే సమయంలో కేసీఆర్ అక్కడకు రాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రశ్నించారు. ఇప్పటి వరకు కేసీఆర్ అరెస్టును ఖండిచలేదు... ప్రజలకు వివరణ ఇవ్వలేదన్నారు. కేసీఆర్ మౌనం దేనికి సంకేతమన్నారు. నిన్న ఈడీ.. మోదీ కలిసే రాష్ట్రానికి వచ్చారన్నారు. రాజకీయంగా కాంగ్రెస్ ను దెబ్బతీయడానికే బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయన్నారు. డ్రామాలు కట్టిపెట్టి మోదీ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదో? మెట్రో విస్తరణకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో చెప్పాలన్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేకనే బీజేపీ అరెస్ట్ డ్రామాకు తెరతీసిందన్నారు.

పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పాలనకు రెఫరెండం

"కాంగ్రెస్ ను దొంగ దెబ్బ తీయడానికి బీఆర్ఎస్, బీజేపీ (BRS BJP Drama)కలిసి ఆడుతున్న నాటకం ఇది. వీరిద్దరి నాటకాన్ని తెలంగాణ సమాజం గమనించాలి. అరెస్టు విషయంలో కేసీఆర్(KCR on Kavitha Arrest), మోదీ మౌనం వెనక వ్యూహం ఏమిటి? మా ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేయడం మోదీ స్థాయికి తగదు. తెలంగాణను అవమానించిన మోదీకి తెలంగాణ అనే పదం పలకడానికి కూడా అర్హత లేదు. పదేళ్ల కేసీఆర్ అవినీతిపై ఎందుకు విచారణ చేయలేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పగలరా? కాళేశ్వరంపై(Kaleswaram) మేం జ్యుడీషియల్ విచారణ చేయిస్తున్నాం. విచారణ నివేదికల ఆధారంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదు. అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరినీ వదలం. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే.. వాళ్లు నిద్ర లేచేలోగా పక్కన ఎవరూ ఉండరు. మీరు పడగొట్టాలని అనుకుంటే.. నిలబెట్టేందుకు మా ప్రయత్నం మేం చేస్తాం. పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఖాయం. నలభై ఏళ్లు రాజకీయ అనుభం ఉన్న కేసీఆర్.. నల్లగొండ సభలో ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు సమర్ధించుకుంటారా? కేసీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదు. పార్లమెంట్ ఎన్నికలు మా పరిపాలనకు రెఫరెండం"- సీఎం రేవంత్ రెడ్డి

Whats_app_banner

సంబంధిత కథనం