Dalitha Bandhu : దళిత బంధు రెండో విడతకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్, ఈసారి 1.30 లక్షల మందికి లబ్ది!-hyderabad cm kcr green signal to dalitha bandhu second phase 1100 people per constituency ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dalitha Bandhu : దళిత బంధు రెండో విడతకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్, ఈసారి 1.30 లక్షల మందికి లబ్ది!

Dalitha Bandhu : దళిత బంధు రెండో విడతకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్, ఈసారి 1.30 లక్షల మందికి లబ్ది!

Bandaru Satyaprasad HT Telugu
Jun 24, 2023 10:38 PM IST

Dalitha Bandhu : దళిత బంధు సెకండ్ ఫేజ్ కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.30 లక్షల మందికి ఈసారి దళిత బంధు అందించనున్నారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

Dalitha Bandhu : దళిత బంధు రెండో విడుతకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 1100 మందికి దళిత బంధు అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. 118 నియోజకవర్గాలలో 1,29,800 మందికి దళిత బంధు అందించనున్నారు. నిబంధల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

yearly horoscope entry point

రెండో విడతలో 1.30 లక్షల మందికి లబ్ది

దళిత బంధు రెండో విడత అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్​ బొజ్జా ఉత్తర్వులు ఇచ్చారు. రెండో విడతలో 1.30 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు. దళిత బంధును హుజురాబాద్​ ఉపఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా​ప్రకటించారు. ఆ ప్రాంతంలో 14,400 మంది ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చొప్పున రూ.500 కోట్లను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.

బడ్జెట్ లో రూ.17, 700 కోట్లు కేటాయింపు

ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో రూ.17,700 కోట్లను దళిత బంధు నిధుల కింద కేటాయించింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దళితులు ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం సూచిస్తుంది. దళితులు స్వావలంబనతో జీవించాలనే సీఎం కేసీఆర్​ దళితబంధు పథకాన్ని ప్రారంభించారు. దళిత బంధు తొలి విడతలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 గ్రామాలను ఎంపిక చేశారు. వీరిలో కొంత మందిని ఎంపిక చేసి దళిత బంధు కింద రూ.20.06 కోట్లు మంజూరు చేశారు. ఈ నగదుతో వారంతా వివిధ వ్యాపారాలు ప్రారంభించారు.

గూగుల్ టీమ్ ప్రశంసలు

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకం ఎంతో బాగుందని గూగుల్‌ బృందం ప్రశంసించింది. వ్యవసాయ క్షేత్రాల సరిహద్దుల సేకరణ కోసం గౌరవ్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని గూగుల్‌ టీమ్‌ సభ్యులు ఇటీవల కరీంనగర్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం గురించి తెలియజేశారు. కరీంనగర్‌లోని కోర్టు రోడ్‌లో దళితబంధు పథకం కింద నిర్వహిస్తున్న అమెరికన్‌ టూరిస్టర్‌ షో రూమ్‌ను వారికి చూపించారు. గూగుల్‌ టీమ్‌ లీడర్‌ గౌరవ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. ఇంత చిన్న నగరంలో అమెరికన్‌ టూరిస్టర్‌ ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ షో రూమ్ ఉండటం, అందులోనూ దళిత బంధు పథకం కింద షోరూమ్ పెట్టడాన్ని ఆయన అభినందించారు.

దళిత బంధు
దళిత బంధు
Whats_app_banner