Smart City Mission : సీఎం రేవంత్​ రెడ్డి చొరవ, స్మార్ట్ సిటీ మిషన్​ గడువు పొడిగింపు-hyderabad central govt extended smart city mission march 2025 as cm revanth reddy requested ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Smart City Mission : సీఎం రేవంత్​ రెడ్డి చొరవ, స్మార్ట్ సిటీ మిషన్​ గడువు పొడిగింపు

Smart City Mission : సీఎం రేవంత్​ రెడ్డి చొరవ, స్మార్ట్ సిటీ మిషన్​ గడువు పొడిగింపు

Bandaru Satyaprasad HT Telugu
Published Jun 30, 2024 04:41 PM IST

Smart City Mission : స్మార్ట్ సిటీ మిషన్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ సిటీ పనులను మార్చి 2025 వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిసింది. వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు కొనసాగుతున్నాయని, గడవు మరికొంత కాలం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు.

సీఎం రేవంత్​ రెడ్డి చొరవ, స్మార్ట్ సిటీ మిషన్​ గడువు పొడిగింపు
సీఎం రేవంత్​ రెడ్డి చొరవ, స్మార్ట్ సిటీ మిషన్​ గడువు పొడిగింపు

Smart City Mission : స్మార్ట్ సిటీ మిష‌న్ ను 2025 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. దిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహల్లాల్ ఖట్టర్ ను కలిసి స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితిని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. రాష్ట్రంలో వరంగల్​, కరీంనగర్​ నగరాల్లో స్మార్ట్ మిషన్ పనులు చేపట్టారు. వరంగల్ లో ఇప్పటి వరకు 45 పనులు పూర్తయ్యాయి. రూ.518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు కొనసాగుతున్నాయి. కరీంనగర్ లో 25 పనులు పూర్తయ్యాయి. రూ. 287 కోట్లతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయి. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేంద్రానికి తెలియజేశారు.

వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగింపు

స్ట్మార్ట్ సిటీలో చేపట్టిన పనులు పూర్తి కానందున, ప్రజా ప్రయోజనార్థం ఈ పనులు పూర్తయ్యే వరకు మిషన్ గడువు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దీనిపై స్పందించిన కేంద్రం స్మార్ట్ సిటీ మిషన్ ను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ శనివారం రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇప్పటికే నిధులు కేటాయించి ఆమోదించిన పనులను కొనసాగించాలని, కొత్త పనుల మంజూరు ఉండవని ఈ లేఖలో స్పష్టం చేసింది. జరుగుతున్న పనులకు సంబంధించిన నిధులను ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ పద్ధతిన విడుదల చేస్తుంది. అందుకే వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయాలని సూచించింది.

హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఇత‌ర న‌గ‌రాలైన వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్ స‌మ‌స్యల‌పైనా ఇటీవల దిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ఖ‌ట్టర్‌తో చ‌ర్చించారు. స్మార్ట్ సిటీ మిష‌న్ కింద వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్ ప‌ట్టణాల్లో చేప‌ట్టిన ప‌నులు పూర్తికాలేద‌ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప‌నులు పూర్తయ్యే వ‌ర‌కు స్మార్ట్ సిటీ మిష‌న్ కాల‌ప‌రిమితిని మ‌రో ఏడాది పాటు పొడిగించాల‌ని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రం స్మార్ట్ సిటీ పనుల గడువును పెంచింది.

స్మార్ట్ సిటీ అనే పదం 2009 ఆర్థిక సంక్షోభం తర్వాత నుంచి విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. పట్టణాలను స్మార్ట్ సిటీలను మార్చేందుకు విమానాశ్రయాలు, హైవేలు ఇతర కమ్యూనికేషన్‌ల నెట్‌వర్క్ తో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. తొలి ఎన్డీఏ ప్రభుత్వంలో జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ ద్వారా ప్రపంచ మార్పులకు అనుగుణంగా స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. జూన్ 2015లో స్మార్ట్ సిటీ మిషన్ ప్రకటించింది. ఈ మిషన్ కింద ఐదేళ్లలో వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

Whats_app_banner

సంబంధిత కథనం