KTR on Kaleshwaram Project : గోదావరి వరదలో కాంగ్రెస్ కుట్రలు కొట్టుకుపోయాయ్, కాళేశ్వరంపై కేటీఆర్ ట్వీట్-hyderabad brs ktr tweet on kaleshwaram medigadda project criticizes congress ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr On Kaleshwaram Project : గోదావరి వరదలో కాంగ్రెస్ కుట్రలు కొట్టుకుపోయాయ్, కాళేశ్వరంపై కేటీఆర్ ట్వీట్

KTR on Kaleshwaram Project : గోదావరి వరదలో కాంగ్రెస్ కుట్రలు కొట్టుకుపోయాయ్, కాళేశ్వరంపై కేటీఆర్ ట్వీట్

KTR on Kaleshwaram Project : ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో మేడిగడ్డ ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నాయి. ఈ ప్రాజెక్టుల వీడియోను కేటీఆర్ ట్వీట్ చేశారు. వరద గోదావరిలో కాంగ్రెస్ కుట్రలు కొట్టుకుపోయాయని విమర్శించారు.

గోదావరి వరదలో కాంగ్రెస్ కుట్రలు కొట్టుకుపోయాయ్, కాళేశ్వరంపై కేటీఆర్ ట్వీట్

KTR on Kaleshwaram Project : ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద నీరు కాళేశ్వరం నుంచి దిగువకు వదులుతున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరంపై ట్వీట్ చేశారు. ప్రాజెక్టు వీడియోను పోస్టు చేసిన ఆయన... ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ కుట్రలు కొట్టుకుపోయాయి కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందన్నారు.

రైతుల కష్టాలు తీర్చే 'మేటి'గడ్డ

పోటెత్తిన వరదకు దుష్టశక్తుల పన్నాగాలే పటాపంచలయ్యాయి.. కానీ కేసీఆర్ సంకల్పం జై కొడుతోంది.. జల హారతి పడుతోందన్నారు. లక్షల క్యూసెక్కుల గంగా ప్రవాహంలో లక్షకోట్లు వృధా చేశారనే విమర్శలు గల్లంతయ్యాయి కానీ మేడిగడ్డ బ్యారేజీ మాత్రం మొక్కవోని దీక్షతో నిలబడిందని, కొండంత బలాన్ని చాటిచెబుతోందన్నారు. ఎవరెన్ని..కుతంత్రాలు చేసినా.. దశాబ్దాలుగా దగాపడ్డ ఈ తెలంగాణ నేలకు ఇప్పటికీ.. ఎప్పటికీ..మేడిగడ్డే మన రైతుల కష్టాలు తీర్చే “మేటి”గడ్డ అన్నారు. కాళేశ్వరమే కరువును పారదోలే “కల్పతరువు” అన్నారు. బురద రాజకీయాలను భూస్థాపితం చేసిన, ఈ మానవ నిర్మిత అద్భుతాన్ని సాధించిన కేసీఆర్ కు తెలంగాణ సమాజం పక్షాన మరోసారి సెల్యూట్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

నిండు కుండల్లా కాళేశ్వరం, మేడిగడ్డ

కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ నిలబడి నిండుకుండల్లా మారాయని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కుంగిపోయింది.. కాళేశ్వరం కొట్టుకుపోయిందని కాంగ్రెస్ పార్టీ, వందల కొద్ది యూట్యూబ్ ఛానెళ్లు నెలల పాటు దుష్ప్రచారం చేసినా.. వాళ్ల కుతంత్రాలను కడిగేస్తూ లక్షల క్యూసెక్కుల వరద నీరు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తుందని తెలిపింది. తెలంగాణ ఎదుగుదలని చూసి ఓర్వలేని కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ఎప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధారగా నిలుస్తుందని తెలిపింది. కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరం మీద బురదజల్లే ప్రయత్నం ఎవరు చేసినా చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయం అని బీఆర్ఎస్ స్పష్టం చేసింది.

కాంగ్రెస్ కౌంటర్

బీఆర్ఎస్, కేటీఆర్ ట్వీట్లపై కాంగ్రెస్ సెటైర్లు వేసింది. బ్యారేజీలు కట్టేది నీటిని ఆపి స్టోరేజ్ చెయ్యడానికి అని, వస్తున్న నీళ్లను వచ్చినట్టు వదిలేస్తుంటే ఇగ బ్యారేజీ ఎందుకు అని విమర్శించింది. ఆ మాత్రం తెల్వకుండా వీడియోలు వేసుకుంటున్నారు అంటూ కాళేశ్వరం నుంచి నీళ్లు దిగువకు వెళ్తున్న వీడియోలు పోస్టు చేసింది.

సంబంధిత కథనం