BRS : బీఆర్ఎస్ లో ఇక నుంచి వారికే పెద్దపీట, గులాబీ దళపతి కీలక నిర్ణయం-hyderabad brs chief kcr key decision high importance to youth leaders ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs : బీఆర్ఎస్ లో ఇక నుంచి వారికే పెద్దపీట, గులాబీ దళపతి కీలక నిర్ణయం

BRS : బీఆర్ఎస్ లో ఇక నుంచి వారికే పెద్దపీట, గులాబీ దళపతి కీలక నిర్ణయం

HT Telugu Desk HT Telugu
Jul 07, 2024 06:18 PM IST

BRS : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయంతో చతికిలపడిన బీఆర్ఎస్ కు పార్టీ ఫిరాయింపులు సమస్యగా మారాయి. దీంతో రంగంలోకి దిగిన కేసీఆర్... యువతకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు.

బీఆర్ఎస్ లో ఇక నుంచి వారికే పెద్దపీట, గులాబీ దళపతి కీలక నిర్ణయం
బీఆర్ఎస్ లో ఇక నుంచి వారికే పెద్దపీట, గులాబీ దళపతి కీలక నిర్ణయం

BRS : గతేడాది జరిగిన అసెంబ్లీ, ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఓటమి బాధ నుంచి పూర్తిగా తేలక ముందే నేతల జంపింగ్ లు ఆ పార్టీకి కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతుంది. ఎవరు ఎప్పుడు పార్టీ మరుతారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని రోజులుగా ఆ పార్టీలో ఇదే తంతు కొనసాగుతూ వస్తుంది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న నేతలే పార్టీ ఫిరాయిస్తున్నారట.

పార్టీలో అసలేం జరుగుతోందో అధినేతకే అంతుచిక్కని రహస్యంగా మారింది. పార్టీ మారేవాళ్లు అధినేతకు కనీస సమాచారాన్ని కూడా ఇవ్వకుండా ఫిరయిస్తున్నారట. కాగా గత వారం రోజుల నుంచి కేసీఆర్ ఆయన ఫాంహౌస్ నుంచే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఫాంహౌస్ లో చర్చలు జరిపారు. అందులో భాగంగానే ఇకపై పార్టీ స్ట్రాటజీ పూర్తిగా మార్చాలని కేసీఆర్ భావిస్తున్నారట. ఇకపై పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న యువతకు, నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.

అన్ని వర్గాలకు దగ్గరయ్యేలా ప్రణాళికలు

దాదాపు రెండు దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాలను శాసిస్తూ వచ్చిన కేసీఆర్.....పార్టీ పగ్గాలు స్వయంగా ఆయన చేతబట్టి అనేక అన్యూహా విజయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ, ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ ను రాజకీయంగా మరింత కుంగదీశాయి అనే చెప్పాలి. ఓటమి తరువాత కేసీఆర్ జిల్లాల వారీగా నిర్వహించిన సమీక్షా సమావేశాలు, క్షేత్ర స్థాయి నేతలతో జరిపిన చర్చలు తరువాత కేసీఆర్ ఓ కంక్లూజన్ కు వచ్చారట. అందులో భాగంగానే ఇప్పటి నుంచి ఆ పార్టీలో యువ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన వెంట నడిచిన యువతకు కీలక బాధ్యతలు ఇవ్వాలని భావిస్తున్నారట. దీంతో పాటు ఉద్యమ సమయంలో కీలక పాత్ర వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, వివిధ సామాజిక వర్గ నేతలకు దగ్గరయ్యేలా కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట.

యువతకు పెద్దపీట

గతంలో వివిధ కార్పొరేషన్లు, కమిషన్ల ఛైర్మన్లు, సభ్యులుగా పని చేసి అనుభవం కలిగిన యువ నేతలను పార్టీ తరఫున జరిగే కీలక కార్యక్రమాల్లో వారికి అగ్ర తాంబూలం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. యువ నేతల్లో ముఖ్యంగా మన్నె కృష్ణాంక్, బాల్క సుమన్, గదరీ కిషోర్, ఎర్రోళ్ల శ్రీనివాస్ వంటి ఉద్యమ నేతలకు పార్టీ కమిటీల్లో చోటు కల్పించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. వీటంన్నిటితో పాటు ప్రస్తుతం కార్యనిర్వహక అధ్యక్షుడుగా ఉన్న కేటీఆర్, హరీష్ రావు వంటి అగ్రనేతలను పార్టీ పరంగా విభజించి వారికి కీలక బాధ్యతలు అప్పజెప్పాలని చూస్తున్నారు. కాగా రాబోయే పార్టీ ఆవిర్భావ సభ వేడుకలను ఘనంగా నిర్వహించి, అందులో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి క్షేత్ర స్థాయి కార్యకర్తలకు భరోసా ఇవ్వనున్నారు. వీటితో పాటు సోషల్ మీడియాను మునపటి కంటే ఆక్టివ్ చేసి కాంగ్రెస్, బీజేపీలను ధీటుగా ఎదుర్కోవాలని చూస్తున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు.

కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

WhatsApp channel

సంబంధిత కథనం