Hyderabad Crime : బోరబండలో దారుణం- రక్తపు మడుగులో యువకుడు, చేతిలో సెల్ ఫోన్!-hyderabad borabanda youth brutally murdered knife marks on body identified ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Crime : బోరబండలో దారుణం- రక్తపు మడుగులో యువకుడు, చేతిలో సెల్ ఫోన్!

Hyderabad Crime : బోరబండలో దారుణం- రక్తపు మడుగులో యువకుడు, చేతిలో సెల్ ఫోన్!

HT Telugu Desk HT Telugu
May 15, 2024 03:19 PM IST

Hyderabad Crime : హైదరాబాద్ బోరబండ పీఎస్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఓ యువకుడ్ని గుర్తుతెలియని దుండగులు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశారు.

బోరబండలో దారుణం
బోరబండలో దారుణం (Pixabay)

Hyderabad Crime : హైదరాబాద్ లోని బొరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బోరబండలోని కార్మిక నగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న నిమ్స్ మైదానంలో గుర్తు తెలియని ఓ యువకుడి రక్తపు మడుగులో మృతి చెందాడు. అటుగా బైక్ పై వెళుతున్న కొందరు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఆర్ నగర్ ఏసీపీ వెంకటరమణ, బోరబండ పోలీసులు క్లూస్ టీం సహాయంతో హత్య జరిగిన ప్రదేశాల్లో ఆధారాలను సేకరిస్తున్నారు. మృతుడి ఒంటి మీద కత్తి పోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా మృతుడి చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. అక్కడే ఉన్న ఓ బిల్డింగ్ వ్యాచ్ మ్యాన్ దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వెంకటరమణ వెల్లడించారు.

yearly horoscope entry point

ములుగులో అంగన్వాడీ టీచర్ దారుణ హత్య

అంగన్వాడీ టీచర్ దారుణ హత్యకు గురైన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రంలోని కాటపురం గ్రామంలో సుజాత అనే మహిళ అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తుంది.ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం డ్యూటీ ముగియగానే తన స్వగ్రామం అయిన ఏటూరు నాగారానికి పయనం అయింది. అయితే బుధవారం అటవీ ప్రాంతంలో కొందరు కూలిపనులు కోసం వెళ్లగా...... అక్కడ సుజాత మృతదేహం కనిపించింది. దీంతో ఒక్కసారే కంగు తిన్న కూలీలు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు సుజాత మెడకు గట్టిగా స్కార్ఫ్ తో చుట్టి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చినట్లు గుర్తించారు. అదేవిధంగా సుజాత వంటిపై ఉన్న నాలుగు తులాల బంగారం, సెల్ఫోన్ కూడా దుండగులు ఎత్తికెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంటి పై ఉన్న బంగారం కోసమే సుజాతను హత్య చేశారా? లేక వేరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

యువతితో అక్రమ సంబంధం, యువకుడి దారుణ హత్య

మంచిర్యాల జిల్లాలో అక్రమ సంబంధం హత్యకు దారి తీసింది. జిల్లా కేంద్రంలోని హాజీపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న మల్యాల నరేష్ అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదే విషయంపై పలు మార్లు పంచాయితీలు కూడా అయ్యాయి. చివరిగా పంచాయితీ అయినప్పుడు.....నరేష్ తన వ్యవహారం మానుకుంటానని, ఊరి నుంచి వెళ్లిపోయి వేరే చోట ఉంటానని చెప్పాడు. కాగా కొన్ని రోజుల క్రితం మళ్లీ అదే గ్రామానికి వచ్చిన నరేష్ యువతితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో యువతి తమ్ముడు... నరేష్ ను ఆటోతో గుద్ది అనంతరం బండ రాయితో మోది హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner

సంబంధిత కథనం