Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు-hyderabad banjara hills police raids on after 9 pub arrested organizers customers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

Bandaru Satyaprasad HT Telugu
May 05, 2024 07:12 PM IST

Hyderabad Pub : హైదరాబాద్ లోని ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసులు దాడులు చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో అసభ్యకరంగా డ్యాన్స్ చేయిస్తున్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో 160 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు
ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

Hyderabad Pub : హైదరాబాద్ బంజారాహిల్స్(Banjarahills) రోడ్డు నెంబర్ 14లోని ఆఫ్టర్ 9 పబ్ పై శనివారం రాత్రి పోలీసులు దాడులు చేశారు. ఆఫ్టర్ 9 పబ్(After 9 Pub) లో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంలో పోలీసులు తనిఖీలు చేశారు. టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు శనివారం రాత్రి ఆఫ్టర్ 9 పబ్ (Pub)పై దాడి చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్ నిర్వాహకులు అనైతిక చర్యలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 40 మంది యువతులతో అసభ్యకరమైన డాన్సులు(Objectionable Dances) చేయిస్తూ పబ్ యాజమాన్యం అనైతిక చర్యలకు పాల్పడుతోందని, ఇది అసభ్యతకు దారితీస్తోందని పోలీసులు(Police) తెలిపారు. నిర్ణీత సమయానికి మించి పబ్ ను నడుపుతున్నట్లు చెప్పారు. అలాగే పబ్ నిర్వాహకులు శబ్ద నిబంధనలను ఉల్లంఘిస్తూ మ్యూజిక్ ప్లే చేస్తున్నట్లు తనిఖీల్లో తేలిందన్నారు.

డ్రగ్స్ వినియోగంపై ఆరా?

పోలీసుల తనిఖీల సమయంలో ఇద్దరు పబ్(After 9 Pub) మేనేజర్లు, ఒక క్యాషియర్, ఒక డీజే ఆపరేటర్, ఐదుగురు బౌన్సర్లు, 131 మంది కస్టమర్లు, 32 మంది మహిళలు పట్టుబడ్డారని తెలిపారు. నిబంధనల ఉల్లంఘనల కింద పబ్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో 160 మందికి పైగా యువతీ యువకుల్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరికి 41 సీఆర్పీసీ(41 CrPC) కింద నోటీసుల జారీ చేసి పంపించారు. పిలిచినప్పుడు విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు. యువకుల్ని మహిళా పునరావాస కేంద్రాలకు తరలించారు. పబ్ (Pub)లో నిషేధిత మాదక ద్రవ్యాలు వినియోగించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు.

బేగంపేట్ లో తనిఖీలు

అలాగే ఇటీవల బేగంపేట్‌(Begumpet)లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్‌పై కూడా నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్(North Zone Task Force) తనిఖీలు నిర్వహించింది. ఇక్కడ బార్(BAR) యాజమాన్యం కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో అనుచితంగా డ్యాన్సులు చేయిస్తుందని గుర్తించారు. అనంతరం ఈ బార్ అండ్ రెస్టారెంట్ పై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ లోని పబ్ లు, బార్లపై టాస్క్ ఫోర్స్ నిఘా పెట్టింది. డ్రగ్స్(Drugs) పై ఉక్కుపాదం మొపుతున్న పోలీసులు.. పబ్ ల్లో డ్రగ్స్ ను అరికట్టేందుకు నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. బార్ , పబ్ ల్లో అశ్లీల లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను మానుకోవాలని పోలీసులు నిర్వాహకులను హెచ్చరించారు. నైట్ లైఫ్ వెన్యూలను నిశితంగా పరిశీలిస్తూ ఉంటామని, నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత కథనం