Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం, కారులో తిప్పుతూ మహిళపై ఉబర్ డ్రైవర్లు అత్యాచారం!-hyderabad alwal uber auto driver molested woman in car roaming in city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం, కారులో తిప్పుతూ మహిళపై ఉబర్ డ్రైవర్లు అత్యాచారం!

Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం, కారులో తిప్పుతూ మహిళపై ఉబర్ డ్రైవర్లు అత్యాచారం!

Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను ఉబర్ ఆటో డ్రైవర్లు బలవంతంగా కారు ఎక్కించి, నగరంలో తిప్పుతూ అత్యాచారం చేశారు.

హైదరాబాద్ లో దారుణం, కారుతో తిప్పుతూ మహిళపై ఉబర్ ఆటో డ్రైవర్లు అత్యాచారం!

Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఉబర్ ఆటో డ్రైవర్ల బ్యాచ్ ఓ మహిళను బంధించి కారులో తిప్పుతూ ఆమెపై అత్యాచారం చేశారు. అల్వాల్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అల్వాల్ పరిధిలో ఓ మహిళ అర్ధరాత్రి తన భర్తతో గొడవపడి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ ఓ ఉబర్ ఆటోలో వెళ్లింది. పోలీసులకు ఫిర్యాదు చేసి తిరిగి అదే ఆటోలో ఇంటికి వెళ్తుండగా, ఆటో డ్రైవర్, మరో ఇద్దరితో కలిసి ఆ మహిళను ఓ కారులో బలవంతంగా ఎక్కించారు. ఆ తర్వాత ఆ మహిళను కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్ చేశారు. వారి నుంచి తప్పించుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు ఆటో డ్రైవర్ ను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది. మహిళలు రాత్రుళ్లు రోడ్లపైకి వచ్చే పరిస్థితి లేదంటూ పలువురు అంటున్నారు.

ఆరు నెలల చిన్నారిపై లైంగిక దాడి

ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల చిన్నారిపై ఓ మృగాడు లైంగిక దాడి చేశాడు. బొబ్బిలిలోని రామభద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు నెలల చిన్నారిపై మద్యం మత్తులో ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉయ్యాలలో నిద్రపోతున్న చిన్నారిపై తాత వరసైన వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారిని తల్లి ఉయ్యాలలో పడుకోబెట్టి స్థానిక కిరాణా దుకాణానికి వెళ్లింది. కొద్దిసేపటికి నార్లవలస గ్రామానికి చెందిన బి.ఎరుకన్న దొర ఇంట్లోకి ప్రవేశించి చిన్నారి లైంగిక దాడి చేశాడు. చిన్నారి బిగ్గరగా ఏడవడంతో అక్కాచెల్లెళ్లు ఇంట్లోకి వచ్చారు. జరిగిన సంఘటనను వారు తల్లికి చెప్పారు. దీంతో నిందితుడిని అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు గ్రామస్తులు వెంబడించారు, అయితే అతను తప్పించుకోగలిగాడు. గాయపడిన చిన్నారిని ప్రాథమిక చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని మరో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడుని నార్లవలసలో పట్టుకున్నారు. పోక్సో చట్టం కింద అతడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనం