Abids Girl Kidnap : అబిడ్స్ లో ఆరేళ్ల బాలిక కిడ్నాప్, గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు
Abids Girl Kidnap : హైదరాబాద్ లోని అబిడ్స్ లో ఆరేళ్ల బాలిక శనివారం సాయంత్రం కిడ్నాప్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల సాయంతో గంటల వ్యవధిలోనే బాలిక ఆచూకీ పసిగట్టి నిందితుడిని అరెస్టు చేశారు.
Abids Girl Kidnap : హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. గాంధీ భవన్ కట్టెల మండికి చెందిన 6 ఏళ్ల బాలికను చాక్లెట్ ఆశ చూపి అగంతకుడు ఆటోలో తీసుకెళ్లాడు. కిడ్నాప్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. 8 బృందాలు పాప కోసం గాలింపు మొదలుపెట్టాయి. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 8 పోలీస్ బృందాలుగా ఏర్పడి 300 సీసీటీవీ కెమెరాలు పరిశీలించి గంటల వ్యవధిలోనే కిడ్నాపర్ ను పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాపర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ బీహార్ కి చెందిన బిలాల్ గా పోలీసులు గుర్తించారు.
అసలేం జరిగింది?
హైదరాబాద్ నగరంలోని అబిడ్స్‌లో శనివారం సాయంత్రం కట్టెలమండిలో ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశచూపి ఓ వ్యక్తి ఆటోలో కిడ్నాప్ చేశాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందు ఐదు బృందాలతో పోలీసులు గాలించారు. అగంతకుడు బాలికను రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనుముల నర్వకు తీసుకెళ్లాడు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసుల...అతడు ఎక్కడికి వెళ్లాడో గుర్తించారు. పోలీసులు నిందితుడిని ఇనుముల నర్వలో అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని అబిడ్స్ పీఎస్ కు తీసుకొచ్చారు. ఆ తర్వాత సైఫాబాద్ భరోసా కేంద్రానికి తరలించారు. కిడ్నాపర్‌ను బిహార్‌కు చెందిన ఎండీ బిలాల్‌గా గుర్తించిన పోలీసులు... నిందితుడిని విచారిస్తున్నారు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసినట్లు అబిడ్స్ ఏసీపీ స్పష్టం చేశారు. అయితే నిందితుడిని పోలీసులు అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చినప్పుడు...బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు అతడిపై దాడి చేశారు. పోలీసులు అతికష్టంమీద నిందితుడిని స్టేషన్ లోపలికి తరలించారు.
ఏపీలో చిన్నారిపై పెద్దనాన్నే లైంగిక దాడి
ఏపీలోని సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చిన్నారిపై పెద్దనాన్నే అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డాడు. సైకోగా మారి ఆ చిన్నారిని అతి దారుణంగా కొట్టి చంపేసి పెన్నా నది ఇసుక మేటల్లో పూడ్చి పెట్టాడు. శుక్రవారం సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండల పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామ దేవత పండగ ఉండటంతో ఒక మహిళ తన చెల్లిలి కుటుంబాన్ని ఆహ్వానించింది. చెల్లిలు బాలింత కావడంతో తాను రాలేనని భర్తతో పాటు కుమార్తెను(8) పంపింది. శుక్రవారం ఉదయాన్ని బాలికను పెదనాన్న గంగాధర్ పెన్నా నది ఒడ్డుకు తీసుకొని వెళ్లాడు. పెన్నానదిని చూపిస్తాడనుకున్న ఆ చిన్నారి… పెద్ద నాన్నతో పాటు వెళ్లింది.
అప్పటికే మద్యం తాగి ఉన్న పెద్ద నాన్న ఆ చిన్నారిపై పెన్ననది ఒడ్డున అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తరువాత చిన్నారి గొంతు నులిమి హత్య చేశాడు. అక్కడే పెన్నానది ఇసుక మేటల్లో ఆ చిన్నారిని పూడ్చి పెట్టి ఏం తెలియని వాడిలా ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఇంటి నుంచి బాలికతో కలిసి వెళ్లిన గంగాధర్ ఇంటికి ఒక్కడే రావడంపై కుటుంబ సభ్యులు చిన్నారి కోసం గంగాధర్‌ను నిలదీశారు. అయితే సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి… హిందూపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గంగాధర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో తానే చిన్నారిని హత్య చేసి, ఇసుక మేటలో పూడ్చినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రాంతాన్ని చూపించాడు. అడిషనల్ ఎస్‌పీ విష్ణువర్ధన్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. సీఎస్‌డీటీ హారతి, హిందూపురం రూరల్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీశారు.
సంబంధిత కథనం