Traffic Alert : సచివాలయం ప్రారంభోత్సవం.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad Traffic Diversion: రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు హైదరాబాద్ నగర పోలీసులు. ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయం ప్రారంభోత్సం సందర్భంగా పలు రూట్లలో ఆంక్షలు విధిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు రూట్ మ్యాప్ ను విడుదల చేశారు.
Traffic Diversions in Hyderabad: నూతన సచివాలయం ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఏప్రిల్ 30వ తేదీ జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ ఇచ్చారు. సచివాలయం వైపు వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లించనున్నారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరుకు ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను అనుమతించమని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు రూట్ మ్యాప్ విడుదల చేశారు.
ట్రెండింగ్ వార్తలు
ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు…
రేపు (ఏప్రిల్ 30) ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ ను మూసివేస్తారు. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఎన్.టి.ఆర్ మార్గం, తెలుగు తల్లి జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను ట్యాంక్ బండ్ వైపు అనుమతిస్తారు. పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డు వైపు మళ్లిస్తారు. చింతల్ బస్తీ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డు వైపు దారిమళ్లించనున్నారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను ట్యాంక్‌బండ్, రాణిగంజ్, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్, అంబేడ్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్ వైపు క్రాస్ చేస్తారు. బీఆర్‌కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలను అనుమతించనున్నారు. బడా గణేశ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను బడా గణేశ్ నుంచి రాజ్‌దూత్ లైన్‌కు మళ్లిస్తారు. వాహనదారులు ఈ మార్గాలలో కాకుండా ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవాలని సూచించారు. ఇక కార్యక్రమానికి వచ్చే వారి కోసం పార్కింగ్ స్థలాలు కేటాయించారు పోలీసులు.
మరోవైపు కొత్త సచివాలయ ప్రారంభోత్సవ ఘట్టం గంటలోపే ముగియనుంది. ముఖ్యమంత్రి రాక మొదలు.. మంత్రులు, అధికారుల సంతకాల ప్రక్రియ మొత్తం.. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాల నుంచి 2 గంటల నాలుగు నిమిషాల్లోపే జరగనుంది. ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించే యాగం కోసం సచివాలయ ప్రాంగణంలో హోమశాల సిద్ధమైంది.మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి చేరుకుంటారు. ఎం కేసీఆర్ తన కుర్చీలో కూర్చున్న తర్వాత.. మంత్రులు తమ ఛాంబర్లకు వెళ్లి కుర్చీల్లో కూర్చొంటారు. మంత్రులు అందరూ కూడా తమ శాఖకు సంబంధించిన ఒక దస్త్రంపై సంతకం చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట 58 నిమిషాల నుంచి 2 గంటల 4 నిమిషాల వరకు అధికారులు కుర్చీల్లో కూర్చొని ఒక దస్త్రంపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. అనంతరం మంత్రులు, అధికారులను ఉద్దేశించింది ముఖ్యమంత్రి ప్రసంగం కూడా ఉంటుంది. సచివాలయ ప్రారంభోత్సవం వేళ ముఖ్యంత్రి కేసీఆర్ సంక్షేమానికి సంబంధించిన దస్త్రాలపై సంతకం చేయనున్నారు. విద్యార్థులకు డైట్ ఛార్జీల పెంపు దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేయనున్నారు. దళిత బంధు పథకం రెండో విడత విధి విధానాలనూ కేసీఆర్ ఆమోదించనున్నారు. ఇక నీటి ప్రాజెక్టులకు సంబంధించి కొత్త సచివాలయంలో తొలి సమీక్ష జరిగే అవకాశం ఉంది.
సంబంధిత కథనం