హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీనితో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో రైలు ఆగిపోయింది. ప్లాట్‌ఫామ్ 1పైన గంటకుపైగా నిలిచింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుక్కొంటున్నారు. మరో ఇంజిన్‌ను తెప్పించేందుకు రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు రామన్నపేట నుంచి మరో ఇంజిన్ తెప్పిస్తున్నారు.
దసరా, దీపావళి పండుగల దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వేతోపాటుగా మరికొన్ని రైల్వే డివిజన్లు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశాయి. చెన్నై-షాలిమార్(02842) నవంబరు 26వ తేదీ వరకు బుధవారాల్లో చెన్నైలో ఉదయం 4.30కు బయలుదేరుతుంది. మరుసటి ఉదయం 11.20కి షాలిమార్ చేరుకుంటుంది. ఇక షాలిమార్- చెన్నై (02841) నవంబరు 24 వరకు సోమవారాల్లో షాలిమార్‌లో సాయంత్రం 6:30కి బయలుదేరుతుంది. మరుసటి రోజు నైట్ 11:30కి చెన్నైలో ఉంటుంది.
కన్యాకుమారి- హైదరాబాద్(07229) ప్రత్యేక రైలు ప్రతీ శుక్రవారం ఉదయం 5.15 గంటలకు కన్యాకుమారిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. హైదరాబాద్- కన్యాకుమారి (07230) రైలు ప్రతి బుధవారం సాయంత్రం 5:20కి హైదరాబాద్‌లో బయలుదేరుతుంది. శుక్రవారం ఉదయం 2:30 గంటలకు కన్యాకుమారిలో ఉంటుంది.
తిరుపతి-సాయినగర్ షిర్డీ (07637) స్పెషల్ రైలు.. ప్రతి ఆదివారం ఉదయం 4 గంటలకు తిరుపతిలో మూవ్ అవుతుంది. మరుసటి రోజున ఉదయం 10.45కు షిర్డీకి చేరుతుంది. సాయినగర్ షిర్డీ-తిరుపతి (07638) ప్రతి సోమవారం రాత్రి 7:35కి షిర్డీలో బయలుదేరుతుంది. బుధవారం మధ్యాహ్నం 1:30కి తిరుపతిలో ఉంటుంది. తిరుపతి-జల్న (07610) రైలు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:15కి ప్రారంభమై.. మరుసటి రోజున మధ్యాహ్నం 3:50 గంటలకు జల్నలో ఉంటుంది. జల్న- తిరుపతి (07609) రైలు ప్రతి సోమవారం ఉదయం 7 గంటలకు జల్న నుంచి బయలుదేరుతుంది. మరుసటి ఉదయం 10:45గంటలకు తిరుపతి చేరుకోనుంది.