మీకు ఆహార భద్రత కార్డు ఉందా…? అందులో ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటున్నారా..?అయితే ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. మీకు దగ్గర్లో ఉండే మీసేవా కేంద్రం వద్దకు వెళ్లి దరఖాస్తు పెట్టుకోవచ్చు. అధికారులు పరిశీలించిన తర్వాత…. పేర్లు నమోదవుతాయి.
ఇప్పటికే జారీ అయిన కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు ముందుగా దరఖాస్తు ఫామ్ ను పూర్తి చేయాలి. మీసేవా కేంద్రాల వద్దకు వెళ్లే వారు… పూర్తి వివరాలతో కూడిన ఫామ్ ను ఇస్తేనే ప్రక్రియను పూర్తి చేస్తారు. అంతేకాకుండా దరఖాస్తుదారుడి ఆధార్ కార్డుతో పాటు మరికొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
డౌన్లోడ్ చేసుకున్న ఫామ్ ను పూర్తి చేయాలి.ఇందులో దరఖాస్తుదారుడి వివరాలను(ఎఫ్ఎస్ సీ నెంబర్) ముందుగా రాయాలి. నివాసం ఉండే ప్రాంతం వివరాలను ఎంట్రీ చేయాలి. ఎవరి వివరాలైతే మార్చాలనుకుంటున్నారో వారి వివరాలను నమోదు చేయాలి.
ఆధార్ ఫ్రూప్స్ తో పాటు నివాసం ఉండే ప్రాంతాన్నిధ్రువీకరించే పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా మీసేవాలో ఆన్ లైన్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఇక రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల ప్రక్రియకు రూ. 45 చెల్లించాల్సి ఉంటుంది. మీ దరఖాస్తును పౌరసరఫరాల శాఖ అధికారులు పరిశీలిస్తారు. ఆపై మీ దరఖాస్తుకు అఫ్రూవ్ ఇస్తారు. ఈ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఉంటే 040-48560012 నెంబర్ లేదా meesevasupport@telangana.gov.in మెయిల్ ను సంప్రదించవచ్చు.