తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాల్లో 95 శాతానికి పైగా సర్వే పూర్తైనట్లు అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి పండగలోపే మొత్తం సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు లబ్ధిదారుల ఎంపిక దిశగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి అధికారులకు కూడా ఆదేశాలు అందినట్లు తెలిసింది.
ఇక ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో అవినీతికి అవకాశం ఇవ్వొద్దని ప్రభుత్వం భావిస్తోంది. అర్హులైన వారికే ఇవ్వాలని నిర్ణయించింది. పారదర్శకతకు పెద్దపీఠ వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే… తాజాగా వెబ్ సైట్ ను కూడా తీసుకొచ్చింది. దీని ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తామని ప్రకటించింది. ఈ వెబ్ సైట్ కు సంబంధించిన ముఖ్య విషయాలు ఇక్కడ తెలుసుకోండి…
ఇక గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 82,82,332 అప్లికేషన్లు అందాయి. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావటంతో వీటి వడపోత ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతికను జోడించి… లబ్ధిదారులను ఎంపిక చేసే విధంగా సర్వే చేయిస్తోంది.
గ్రామ సభ ఆమోదం తర్వాతనే… ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల జాబితాను ప్రకటించనున్నారు.ఈ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే మొదటి విడతలో సొంత స్థలం ఉన్న నిరు పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది. ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను నాలుగు ధపాలుగా జమ చేయనున్నారు.
సంబంధిత కథనం