TG MLC Voter Registration Status : ఎమ్మెల్సీ ఓటుకు దరఖాస్తు చేసుకున్నారా..? మీ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Telangana MLC Elections 2025: ఉత్తర తెలంగాణలో పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువు ముగిసింది. మూడు లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే సీఈవో తెలంగాణ వెబ్ సైట్ లో మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఏ స్థితిలో ఉందనేది తెలుస్తుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి…
ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. వచ్చే ఏడాది నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందుకోసం ఓటరు నమోదు ప్రక్రియకి దరఖాస్తులను స్వీకరించారు. ఈ గడువు కూడా నవంబర్ 6వ తేదీతో పూర్తి అయింది.
గడువు ముగిసే సమయానికి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో 336362 మంది పట్టభద్రులు ఓటర్ నమోదు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులోనూ ఇప్పటివరకు 1 లక్షా 39 వేల మంది పట్టభద్రుల దరఖాస్తుల పరిశీలన పూర్తై ఓటర్లుగా నమోదయ్యారు. పరిశీలనలో 1,82,610 దరఖాస్తులున్నాయి. ఈనెల 23న ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది
సెప్టెంబర్ 30న మొదలైన ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. నవంబర్ 6వ తేదీన ముగిసింది. గడువు ముగిసే వరకు ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో పది లక్షల వరకు పట్టభద్రులు ఉంటారని అంచనా వేయగా కేవలం 3,36,362 మంది పట్టభద్రులు ఓటర్ నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు చేసుకున్న వారు.. అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
ఎమ్మెల్సీ ఓటు దరఖాస్తు స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి…
- గ్రాడ్యుయేట్ లేదా టీచర్ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://ceotelangana.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే MLC Graduates - Teacher ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు Track Your Status అనే ఆప్షన్ ఉంటుంది.
- ఇక్కడ మీరు గ్రాడ్యుయేట్ ఓటరగా నమోదు చేసుకుంటే Form-18 (Graduate's) ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. లేదా టీచర్ గా ఉంటే Form-19(Teacher's)ను ఎంపిక చేసుకోవాలి.
- మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడు జనరేట్ అయిన Application ఐడీ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
- గేట్ అప్లికేషన్ స్టేటస్ పై క్లిక్ చేస్తే మీ దరఖాస్తు ఏ స్థితిలో ఉందనేది తెలుస్తోంది.
నవంబర్ 23న ముసాయిదా జాబితా…!
- ఈ నాలుగు జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీల కాలపరిమితి 2025 మార్చి 29 నాటితో ముగియనుంది.
- ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఎలక్షన్ కమిషన్ అర్హత కలిగిన ఓటర్లకు పేర్ల నమోదు కోసం అవకాశం కల్పించింది.
- అసిస్టెంట్ ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ (ఏఈఆర్ఓ) కార్యాలయాల్లో నేరుగా కూడా ఓటర్లు దరఖాస్తులు సమర్పించవచ్చు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం మరోసారి తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
- గడువులోపు దాఖలైన దరఖాస్తులను పరిశీలించిన మీదట నవంబర్ 23 న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించడం జరుగుతుంది.
- ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నవంబర్ 23 నుండి డిసెంబర్ 09 వ తేదీ వరకు తెలియజేయాలి.
- 2024 డిసెంబర్ 30 న నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను వెలువరిస్తారు.
ఈ లింక్ పై క్లిక్ చేసి ఎమ్మెల్సీ ఓటు దరఖాస్తు స్టేటస్ నేరుగా చెక్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం