కుల ధ్రవీకరణపత్రం….. ప్రతి విద్యార్థితో పాటు ఉద్యోగ అభ్యర్థికి ఎంతో ముఖ్యమైనది. స్కాలర్ షిప్ దరఖాస్తు చేసుకోవాలన్నా… ఏదైనా ఉద్యోగానికి అప్లికేషన్ చేయాలన్నా… ఈ సర్టిఫికెట్ తప్పనిసరి అన్నట్లు ఉంటుంది. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చే పలు పథకాలకు అప్లయ్ చేసుకునే క్రమంలో కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ అవసరపడుతోంది.
ప్రస్తుతం ఆన్ లైన్ విధానంలోనే క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. మీ-సేవా ఆధారంగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే దరఖాస్తు చేసిన వెంటనే క్షణాల వ్యవధిలోనే ఈ సర్టిఫికెట్ పొందలేం. మండల రెవెన్యూ అధికారి పరిశీలన తర్వాతే… ఈ సర్టిఫికెట్లు జారీ అవుతాయి. వీటిని కూడా మీసేవా ద్వారానే పొందాల్సి ఉంటుంది.
అయిత దరఖాస్తు చేసుకున్న తర్వాత… చాలా మంది మండల కార్యాలయాలను సంప్రదిస్తుంటారు. లేకపోతే మీసేవా కేంద్రాలకు వెళ్లి ఆరా తీస్తుంటారు. అయితే అలా కాకుండా మీ అప్లికేషన్ స్టేటస్ ను సింపుల్ గా తెలుసుకునే వీలు ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి…