తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన అప్లికేషన్లే కాదు.... పాటు మీసేవా ద్వారా కూడా భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు.... అర్హతలు కలిగి ఉంటే అఫ్రూవ్ చేస్తున్నారు. వీరికి మాత్రమే కొత్త కార్డులను జారీ చేస్తున్నారు. ఇప్పటికే పలువురికి కొత్త కార్డులు మంజూరు కాగా... మరికొందరి పేర్లను పాత కార్డుల్లోకి ఎంట్రీ కూడా చేస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రాజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరు గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తులను స్వీకరించింది. ఇదే సమయంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలు కూడా చేసింది. దీంతో భారీ సంఖ్యలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. తెల్ల కాగితంపై రాసి గ్రామ, వార్డు ఆఫీసుల్లో సమర్పించారు. ఇదంతా కూడా ఆఫ్ లైన్ ద్వారా సాగింది.
ప్రజాపాలన ద్వారా భారీగా దరఖాస్తులు రావటంతో... వాటిని పరిశీలించటం క్షేత్రస్థాయిలోని అధికారులు, సిబ్బందికి కాస్త ఇబ్బందికరంగానే మారింది. అయితే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు రేషన్ కార్డుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి కార్డు మంజూరవుతుందని స్పష్టం చేస్తున్నారు.
కొత్త రేషన్ కార్డు పొందినవాళ్లు లేదా పాత కార్డులో పేర్లు నమోదైన వారు... వారి వివరాలను ఆన్ లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ముందుగా https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఎఫ్ఎస్ సీ సెర్చ్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ రేషన్ కార్డు సెర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే FSC సెర్చ్ అనే ఆప్షన్ డిస్ ప్లే అవుతుంది. దీనిపై క్లిక్ చేసి FSC Ref No నెంబర్ లేదా మీ రేషన్ కార్డు నెంబర్ ను ఎంట్రీ చేసి జిల్లాను ఎంచుకోవాల్లి. చివర్లో ఉండే సెర్చ్ పై క్లిక్ చేస్తే మీ కార్డు వివరాలను కింద డిస్ ప్లే అవుతాయి.
సంబంధిత కథనం