TG Govt Holiday: నేడు తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు సెలవు
TG Govt Holiday: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి నివాళిగా తెలంగాణలో నేడు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు.
TG Govt Holiday: తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు నేడు సెలవు ప్రకటించారు. మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం నివాళిలర్పిస్తూ నేడు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. దేశ ఆర్థిక రంగ సంస్కరణల్లో కీలక పాత్ర పోషించిన మన్మోహన్ సింగ్ 2004-2014 మధ్య కాలంలో దేశ ప్రధాన మంత్రిగా సేవలు అందించారు.
యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించారు. కాంగ్రెస్ పార్టీ తరపున సుదీర్ఘ కాలం రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. 92ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో ఎయిమ్స్‌లో కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ మృతికి నివాళిలర్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. సంతాప సమయంలో ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాలను అవనతం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలన్నింటిని రద్దు చేసింది. మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటక నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లాు.