Hyderabad ORR Lease : 30 ఏళ్లపాటు లీజుకు ఓఆర్ఆర్.. 6 వేల కోట్లు టార్గెట్-hmda plans to lease orr for 30 years to raises 6 000 crores ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Orr Lease : 30 ఏళ్లపాటు లీజుకు ఓఆర్ఆర్.. 6 వేల కోట్లు టార్గెట్

Hyderabad ORR Lease : 30 ఏళ్లపాటు లీజుకు ఓఆర్ఆర్.. 6 వేల కోట్లు టార్గెట్

Anand Sai HT Telugu
Sep 19, 2022 08:49 PM IST

Hyderabad Outer Ring Road : ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్ల వరకు దీర్ఘకాలిక లీజుకు ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. రూ.4,000 కోట్ల నుంచి రూ.6,000 కోట్ల వరకు సమీకరించాలని ప్రణాళికలు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.

<p>ఓఆర్ఆర్</p>
<p>ఓఆర్ఆర్</p>

హైదరాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్డు(Hyderabad Outer Ring Road)ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు హెచ్ఎండీఏ ప్లాన్ చేస్తోంది. దీనిద్వారా 6వేల కోట్లను సమీకరించాలని చూస్తోంది. ఒకవేళ 20 ఏళ్ల లీజుకు ఇస్తే 4వేల కోట్లు, 30 ఏళ్ల లీజు అయితే రూ. 6వేల కోట్లు వ‌స్తాయ‌ని అంచ‌నాలు వేస్తున్నారు. ఏదైనా ప్రైవేట్‌ ఏజెన్సీకి దీర్ఘకాలిక లీజుకు ఇవ్వాలనే ఆలోచనలో హెచ్‌ఎండీఏ(HMDA) ఉన్నట్టుగా తెలుస్తోంది.

హెచ్ఎండీఏ లీజుకు ఇవ్వబోయే సంస్థ కేవలం టోల్ వసూలు(Toll Charges) చేయడమే కాదు. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ప్రమాదాలు జరిగిన సమయంలో క్లియరెన్స్, రిపేర్లు, రోడ్ల నిర్వహణ బాధ్యత కూడా చేపట్టాలే ప్లాన్ చేస్తోంది. ఓఆర్ఆర్(ORR) ఆస్తులను కాపాడటం, కబ్జాలు జరగకుండా చూడటం కూడా లీజు సంస్థ బాధ్యతే తీసుకోవాలనే ప్రతిపాదనతో హెచ్ఎండీఏ ఉంది.

ప్రస్తుతం ఔటర్‌పై Eagle Infra India Limited అనే సంస్థ టోల్ వసూలు చేస్తోంది. ప్రతి నెలా రూ.24 కోట్లను హెచ్ఎండీఏకు అందిస్తోంది. ఓఆర్ఆర్ టోల్ వసూలు(ORR Toll Charges) ద్వారా 2019-20లో రూ.351 కోట్లు వచ్చాయి. 2020-21లో చూసుకుంటే.. రూ.310 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఆ ఏడాది కోవిడ్(Covid) కారణంగా ఆదాయం తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.421 కోట్ల ఆదాయం వచ్చింది.

ఈగల్ ఇన్‌ఫ్రా కేవలం టోల్ మాత్రమే వసూలు చేస్తుంది. ఓఆర్ఆర్ నిర్వహణ బాధ్యతను హెచ్ఎండీఏనే చూసుకుంటోంది. దీంతో హెచ్ఎండీఏకు పెద్ద సమస్య అవుతుంది. లీజుకు ఇచ్చిన సంస్థకే బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. సుదీర్ఘకాలం లీజుకు ఇస్తే.. లాభనష్టాలను అంచనా వేయడంతో పాటు సంబంధిత ప్రక్రియకు అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేయడానికి ఓ కన్సల్టెన్సీని నియమించినట్లు సమాచారం. ఓఆర్ఆర్, దాని సంబంధిత ఆస్తుల ద్వారా వస్తున్న రెవెన్యూ(Revenue)ను అంచనా వేయడంతో పాటు ట్రాఫిక్ ఎంత, భవిష్యత్‌లో ఎంత పెరగవచ్చు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కోసం ఎంత ఖర్చు అవుతుంది, రోడ్ సేఫ్టీ ఫీచర్లు, రోడ్ల అభివృద్ధికి ఎంత ఖర్చు చేయాలో కన్సల్టెన్సీ నివేదిక ఇస్తుంది.

అధిక ఆదాయాన్ని ఆర్జించేందుకు టీఓటీ ప్రాతిపదికన ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టును మంజూరు చేసేందుకు మున్సిపల్‌ అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోందని ఓ అధికారి తెలిపారు. ఈ మోడల్‌ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(national highway authority of india) అభివృద్ధి చేసిందని తెలిపారు.

'ఇది మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగించగల నిధులను రూపొందించడంలో సహాయపడుతుంది. ఓఆర్‌ఆర్‌ను 20 ఏళ్ల లీజుకు, 30 ఏళ్ల లీజుకు ఇస్తే కోట్ల ఆదాయం సమకూరుతుంది.' అని అధికారి తెలిపారు.

అధిక ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు టీఓటీ ప్రాతిపదికన ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టును మంజూరు చేసేందుకు మున్సిపల్‌ అధికార యంత్రాంగం(municipal Staff) ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఈ మోడల్‌ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. మౌలిక సదుపాయాల మరమ్మతు నిర్వహణ పనులను ప్రైవేటు సంస్థే నిర్వహిస్తుంది. ఓఆర్ఆర్ ని పరిశీలించి, ఆక్రమణలను నిరోధించవలసి కూడా ఉంటుంది. మెుత్తం ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తే ఎలా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.