HMDA Limits Extended : హెచ్ఎండీఏ పరిధిలోకి మరో 4 జిల్లాల్లోని 16 మండలాలు, ఉత్తర్వులు జారీ-hmda jurisdiction extended 16 mandals from 4 districts now included ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hmda Limits Extended : హెచ్ఎండీఏ పరిధిలోకి మరో 4 జిల్లాల్లోని 16 మండలాలు, ఉత్తర్వులు జారీ

HMDA Limits Extended : హెచ్ఎండీఏ పరిధిలోకి మరో 4 జిల్లాల్లోని 16 మండలాలు, ఉత్తర్వులు జారీ

HMDA Limits Extended : హైదరాబాద్ సిటీ క్రమంగా విస్తరిస్తోంది. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు జిల్లాల్లోని 16 మండలాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

హెచ్ఎండీఏ పరిధిలోకి మరో 4 జిల్లాల్లోని 16 మండలాలు, ఉత్తర్వులు జారీ

HMDA Limits Extended : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోకి మరో 4 జిల్లాల్లోని 16 మండలాలను చేరుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మహబూబ్‌నగర్‌, వికారాబాద్, నాగర్‌కర్నూల్‌, నల్గొండ జిల్లాల్లోని 16 మండలాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకొచ్చింది. తాజా నిర్ణయంతో కొత్తగా 3 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం హెచ్‌ఎండీఏ పరిధిలోకి చేరనుంది. కొత్తగా చేర్చిన 16 మండలాలతో కలిపి...హెచ్‌ఎండీఏ పరిధిలో మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలు ఉన్నాయి.

మొత్తం 11 జిల్లాలకు చేరిన పరిధి

తెలంగాణ సర్కార్ హెచ్ఎండీఏ పరిధిని విస్తరించింది. హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ ఎండీఏ పరిధిలోకి 36 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో హెచ్ఎండీఏ పరిధి 1355 గ్రామాలు, 104 మండలాలు, 11 జిల్లాల వరకు పెరిగింది. ఇప్పటి వరకూ 7 జిల్లాల వరకు ఉన్న ఈ పరిధిలో తాజాగా 4 జిల్లాలు చేర్చడంతో మొత్తం 11 జిల్లాలకు చేరింది. ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏను విస్తరించారు.

హెచ్ఎండీఏ పరిధి విస్తరణతో ప్రభుత్వం చేపట్టిన మాస్టర్ ప్లాన్ అమల్లోకి రానుంది. దీంతో హైదరాబాద్ పరిధిలో విప్లవాత్మక రానున్నాయి. 2031 మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు అమల్లో ఉండగా...దీనికి మరో 25 ఏళ్లు పొడిగించే అవకాశాలు ఉన్నాయి. హెచ్ఎండీఏ విస్తరణ పెరగడంతో భూముల రేట్లలో భారీగా పెరిగే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ సిటీ అభివృద్ధి కూడా ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించనుంది. గత పదేళ్లుగా హైదరాబాద్ సిటీ విస్తరిస్తూ వచ్చింది. దీంతో శివారుల్లోని భూములకు రెక్కలొచ్చాయి.

ప్రభుత్వ తాజా నిర్ణయంతో నగర శివారుల్లోని భూముల ధరలు అమాంతం పెరగనున్నాయి. ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలో చేరిన 16 మండలాల్లో భూముల ధరలకు రెక్కలొస్తాయి. ప్రభుత్వ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకోనుంది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం