తెలుగు న్యూస్ / తెలంగాణ /
Telangana Budget 2025 : తెలంగాణ వార్షిక బడ్జెట్ - శాఖలవారీగా కేటాయింపులివే
Telangana Budget 2025-26 Updates : 2025- 26 ఏడాదిగానూ తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. మొత్తం రూ. 3,04,965 కోట్లతో పద్దను సభ ముందుకు తీసుకువచ్చింది. ఇందులో విద్యాశాఖకు రూ. 23,108 కోట్లు, విద్యుత్ రంగానికి రూ. 21,221 కోట్లను కేటాయించారు. మిగతా కేటాయింపుల వివరాలను ఇక్కడ చూడండి…
తెలంగాణ వార్షిక బడ్జెట్
తెలంగాణ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 3 లక్షల కోట్లకుపైగా పద్దును తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను శాసనసభలో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
రాష్ట్ర తలసరి ఆదాయం - రూ. 3,79,751గా ఉందని ఆర్థికమంత్రి భట్టి తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ. 3,79,751గా ఉంటే.. వృద్ధిరేటు 9.6 శాతంగా నమోదైందని వివరించారు. దేశ తలసరి ఆదాయం: రూ. 2,55,079గా ఉందని.. దీనితో పోల్చితే వృద్ధిరేటు 8.8 శాతంగా ఉందని బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు.
తెలంగాణ బడ్జెట్ 2025 - శాఖలవారీగా కేటాయింపులు:
- తెలంగాణ వార్షిక బడ్జెట్(2025-26) - రూ.3,04,965 కోట్లు
- రెవెన్యూ వ్యయం - రూ.2,26,982 కోట్లు
- మూలధన వ్యయం - రూ.36,504 కోట్లు
- షెడ్యూల్ కులాల సంక్షేమం - రూ. 40,232 కోట్ల
- పంచాయతీ రాజ్ శాఖ - రూ. 31,605 కోట్లు
- వ్యవసాయశాఖ - రూ. 24,439 కోట్లు
- ఇరిగేషన్ - రూ. 23, 373 కోట్లు
- విద్యాశాఖ - రూ. 23,108 కోట్లు
- విద్యుత్ - రూ. 21,221 కోట్లు
- మున్సిపల్ శాఖ - రూ. 17, 677 కోట్లు
- గిరిజన సంక్షేమం - రూ. 17169 కోట్లు
- ఆరోగ్యం - రూ.12393 కోట్లు
- బీసీ సంక్షేమం - రూ. 11405 కోట్లు
- రోడ్లు భవనాలు - రూ. 5907 కోట్లు
- పౌరసరఫరాలు - రూ. 5734 కోట్లు
- మైనార్టీ వ్యవహారాలు - రూ. 3591 కోట్లు
- పరిశ్రమలు - రూ. 3527 కోట్లు
- స్రీ మరియు శిశు సంక్షేమం - 2862 కోట్లు
- పశుసంవర్థకం - రూ. 1674 కోట్లు
- పర్యావరణం, అటవీ శాఖ -రూ. 1023 కోట్లు
- టూరిజం - రూ. 775 కోట్లు
- ఐటీ - రూ. 774 కోట్లు
- క్రీడలు - రూ. 465 కోట్లు
- చేనేత రంగం - రూ. 371 కోట్లు.
సంబంధిత కథనం