నైరుతి తెలంగాణ, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం... ఉత్తర, అంతర్గత కర్ణాటకకు అనుకుని ఉన్న ప్రాంతాల మీదుగా కొనసాగుతోంది. రాయలసీమ మీదుగా సగటు సముద్రమట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరక విస్తరించి... ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణవైపు వంగి ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ద్రోణి ప్రస్తుతం పశ్చిమ మధ్య ఆరేబియా సముద్రం నుంచి దక్షిణ తీర ఒడిశా వరకు తెలంగాణ, రాయలసీమను అనుకుని కొనసాగుతోంది. ఉత్తర అంతర్గత కర్ణాటక మరియు పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం... సగటు సముద్రమట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నాయని ఐఎండీ తాజా బులెటిన్ లో తెలిపింది.
ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో... తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చు.హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ వివరాల ప్రకారం... ఇవాళ(జూన్ 13) నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్,కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 40 -50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు(జూన్ 14) నిర్మల్, నిజామాబాజ్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది.
ఎల్లుండి(జూన్ 15) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చు.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో మరో 4 రోజులు ఏపీలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం (13-06-25) మన్యం, అల్లూరి,కాకినాడ,ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, పల్నాడు,ప్రకాశం,నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.