తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ హెచ్చరికలను జారీ చేసింది. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు పడనున్నాయని పేర్కొంది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ వివరాల ప్రకారం….రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చు. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
జూన్ 19వ తేదీన రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశంఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జూన్ 20వ తేదీ నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఎలాంటి హెచ్చరికలు లేవు.