వెదర్ రిపోర్ట్ : బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి - ఏపీలో మోస్తారు, తెలంగాణకు భారీ వర్ష సూచన..!-heavy rains likely in several districts of telangana imd weather updates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  వెదర్ రిపోర్ట్ : బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి - ఏపీలో మోస్తారు, తెలంగాణకు భారీ వర్ష సూచన..!

వెదర్ రిపోర్ట్ : బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి - ఏపీలో మోస్తారు, తెలంగాణకు భారీ వర్ష సూచన..!

తెలంగాణకు ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మంగళవారం హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరోవైపు ఏపీలోని ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు పడొచ్చు.

భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. తాజాగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరిత ఆవర్తన ప్రభావంతో…. వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.

తెలంగాణకు భారీ వర్ష సూచన…

హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం... ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల,భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు పడొచ్చు. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల 30 -40 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం... ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల,భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు పడొచ్చు ఈజిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల 30 -40 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.

రేపు (జూలై 3) రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచిఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశంఉంది. ఆదిలాబాద్,ఆసిఫాబాద్,మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్,జగిత్యాల,సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి,ములుగు, కొత్తగూడెం,ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట,మహబూబాబాద్,వరంగల్, హన్మకొండ,సిద్ధిపేట, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలన్నింటికి ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఇక హైదరాబాద్ లో చూస్తే ఇవాళ తేలికపాటి నుంచిమోస్తారు వర్షం లేదా ఉరుములు, మెరుపులతోకూడిన వర్షాలు పడొచ్చు. 30 - 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.ఉపరితల గాలులు పశ్చిమ, నైరుతి దిశలో వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఏపీలోనూ వర్షాలు:

మరోవైపు ఏపీలో కూడా వర్షాలు పడుతున్నాయి. ఇవాళ(జూలై 2) శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఉత్తరాంధ్రలోని కొన్నిచోట్ల మాత్రం భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.