ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈశాన్య ఆరేబియా సముద్రం నుంచి బెంగాల్ ఉత్తర భాగాలతో పాటు పలు రాష్ట్రాల మీదుగా కొనసాగుతోందని పేర్కొంది. సగటు సముద్రమట్టానికి 3.1 కి.మీ ఎత్తువరకు విస్తరించి... ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణం వైపు వంగి ఉందని వివరించింది. ఈ ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
రేపు (జూలై 6) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
ఎల్లుండి (జూలై 7) రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
జూలై 8వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చు.
ఏపీలో ఇవాళ(జూలై 5) శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, ఏలూరు,తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.