Rains in Telangana : వికారాబాద్ జిల్లాలో వ‌డ‌గండ్ల వాన‌.. హైదరాబాద్ లో వర్షం..!-heavy rain in vikarabad and hyderabad district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Heavy Rain In Vikarabad And Hyderabad District

Rains in Telangana : వికారాబాద్ జిల్లాలో వ‌డ‌గండ్ల వాన‌.. హైదరాబాద్ లో వర్షం..!

HT Telugu Desk HT Telugu
Mar 16, 2023 01:57 PM IST

Weather Updates Telangana : వికారాబాద్ జిల్లాలో వ‌డ‌గండ్ల వాన‌ కురిసింది. అంతేకాకుండా పలుచోట్ల వర్షాలు కురవగా… హైదరాబాద్ లో కూడా వాతావరణం పూర్తిగా చల్లబడింది.

వికారాబాద్ లో వర్షం
వికారాబాద్ లో వర్షం (twitter)

Rains in Telangana: రానున్న ఐదు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు ఇచ్చింది. అయితే గురువారం వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వడగండ్ల వర్షం కురిసింది. పరిగి, పూడురు మండలాల పరిధిలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఇక హైదరాబాద్ పరిధిలో కూడా వాతావరణం పూర్తిగా చల్లబడింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం మొదలైంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది. మణికొండ, కొండాపూర్, లింగంపల్లి, షేక్ పేట్, రాజేంద్రనగర్, కూకట్ పల్లి, పటాన్ చెరు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

ఎల్లో అలర్ట్ జారీ...

నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఇక 18, 19 తేదీల్లో కూడా కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. 30 -40 కిమీ వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని చెప్పింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం నేపథ్యంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, డా.అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, బాపట్ల, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఈ నెల 18న అనేక చోట్ల భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. 17,18,19 తేదీలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతో.. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలకు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, మరికొన్ని చోట్ల మోస్తారు.. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది..

IPL_Entry_Point

సంబంధిత కథనం