TS Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం.. హైదరాబాద్‌ లో భారీ వర్షం-heavy rain in hyderabad latest weather updates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Heavy Rain In Hyderabad Latest Weather Updates Check Here

TS Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం.. హైదరాబాద్‌ లో భారీ వర్షం

Maheshwaram Mahendra Chary HT Telugu
May 28, 2023 03:31 PM IST

Rain in Hyderabad:హైదరాబాద్‌ లో మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ లో భారీ వర్షం

Weather Updates Of Telangana: తెలంగాణలో ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు సాయంత్రం లేదా రాత్రి వేళలో వర్షాలు కూడా పడుతున్నాయి. అయితే ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా... ఆ తర్వాత వాతావరణంలో మార్పులు సంభవించాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌, కూకట్‌పల్లి, అమీర్‌పేట్‌, యూసఫ్ గూడ, ఖైరతాబాద్, కేపీహెచ్‌బీ, దిల్‌సుఖ్ నగర్‌, ఎల్బీనగర్‌ తో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

5 రోజులపాటు వర్ష సూచన…

తెలంగాణకు మరోసారి వర్ష సూచన ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మే 28వ నుంచి నుంచి సోమవారం ఉదయం వరకు కొముర్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. సోమవారం పలుచోట్ల పొడి వాతావరణం ఏర్పడుతుందని, మరికొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కొన్నిచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మంగళవారం నుంచి జూన్‌ 3 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

రుతు పవనాల (Monsoon) రాకపై భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కేరళకు నైరుతి రుతుపవనాలు జూన్ 4 వ తేదీ వరకు చేరుతాయని వెల్లడించింది. సాధారణంగా నైరుతి రుతు పవనాలు (southwest monsoon) కేరళకు జూన్ 1వ తేదీ వరకు చేరుతాయని… ఈ సంవత్సరం అవి జూన్ 4 వరకు కేరళకు వస్తాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది.

IPL_Entry_Point