MLC Kavitha Petition: నేడు ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంలో విచారణ
MLC Kavitha Petition: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరుగనుంది. ఈడీ నోటీసుల్ని రద్దు చేయాలని కోరుతూ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
MLC Kavitha Petition: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణకు రావాలంటూ ఈడీ జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత పది రోజుల క్రితం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈడీ నోటీసులపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. నళిని చిదంబరం కేసులో మాదిరి ఉపశమనం కోరుతున్నారు. మహిళల విచారణకు సంబంధించిన మార్గదర‌్శకాలపై కూడా కవిత స్పష్టత కోరుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు
సెప్టెంబర్ 15న జరిగిన విచారణలో కౌంటర్ దాఖలు చేయడానికి ఈడీ తరపు న్యాయవాదులు పది రోజుల గడువు కోరారు. దీంతో విచారణకు హాజరు కావాలని కవితకు ఇచ్చిన నోటీసులను కూడా పది రోజులు వాయిదా వేశారు. గడువు పూర్తి కావడంతో సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం విచారణ జరుపనుంది. సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది
గత విచారణలో సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవితకు తాత్కలిక ఊరట లభించింది. ఈడీ విచారణను సవాలు చేస్తూ గతంలో కవిత దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే మరోసారి నోటీసులు జారీ చేయడంపై సమాధానం చెప్పాలని ఈడీని ధర్మాసనం ఆదేశించింది.
కవిత కేసు విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాలపై చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తాను భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని కవిత చెప్పారు.ఈడీ నోటీసుల నేపథ్యంలో జరగాల్సిన ఈడీ విచారణకు ఆమె హాజరు కాలేదు. సుప్రీం కోర్టులో విచారణ తర్వాత తన స్పందన తెలియ చేస్తానని చెప్పారు.
గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై విచారణ సందర్భంగా ఈడీ మొదటిసారి నోటీసులు జారీ చేసిన సమయంలో కవిత కోర్టును ఆశ్రయించారు. మహిళల్ని ఇంటిలో విచారించాలని, నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసుల్లో దాఖలైన పిటిషన్లను ఆమె ఉటంకించారు. తనకు కూడా విచారణ నుంచి ఉపశమనం కోరుతున్నారు.
కోర్టు విచారణ జరుగుతున్న సమయంలో అరెస్టులు సరికాదని కవిత తరఫు న్యాయవాదులు వాదించారు. ఇదే వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత గతంలో ఈడీ మూడ్రోజుల పాటు విచారణకు హాజరయ్యారు. తాజా నోటీసులకు ఆమె హాజరు కావాల్సి ఉండగా మరోమారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో కవిత దాఖలు చేసిన రెండు పిటిషన్లపై విచారణ సెప్టెంబర్ 15న సుప్రీం కోర్టులో జరిగింది.
మహిళల విచారణ విషయంలో ఈడీ విధానమేమిటన్నది ఇప్పటి వరకు అఫిడవిట్ దాఖలు చేయలేదని కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. దీంతో అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజు స్పందన తెలియచేయడానికి 10రోజుల గడువు కోరారు.
ఈడీ నోటీసుల నేపథ్యంలో కవిత ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందేనని, కవిత ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉంటే గడువు తీసుకోవచ్చని తెలిపారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆరు వారాల గడువులోగా ఈడీ అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉందని విక్రమ్ చౌదరి గుర్తు చేశారు. దీంతో ధర్మాసనం 26వ తేదీకి కేసును వాయిదా వేసింది. కౌంటర్ అఫిడవిట్ వేయాలని ఈడీ ఆదేశించడంతో పది రోజులు గడువు కోరింది. అప్పటి వరకు ఈడీ నోటీసులు చెల్లవని సుప్రీం కోర్టు తెలిపింది. జస్టిస్ సంజీవ్ కిషన్ కౌర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నేడు కవిత పిటిషన్‌పై విచారణ జరుపనుంది.
టాపిక్