Harish Rao in Warangal: ‘ఇప్పుడు నేను పోత బిడ్డో సర్కార్ దవాఖానకు అంటున్నరు..’-health minister harish rao reviews health city work in warangal says it will be ready by year end ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Health Minister Harish Rao Reviews Health City Work In Warangal, Says, It Will Be Ready By Year End

Harish Rao in Warangal: ‘ఇప్పుడు నేను పోత బిడ్డో సర్కార్ దవాఖానకు అంటున్నరు..’

HT Telugu Desk HT Telugu
Jan 28, 2023 05:00 PM IST

Harish Rao in Warangal: రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు శనివారం వరంగల్ లో హెల్త్ సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు.

వరంగల్ లో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
వరంగల్ లో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

Harish Rao in Warangal: హైదరాబాద్ తరువాత ఆ స్థాయిలో వరంగల్ (WARANGAL) ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) భావిస్తున్నారని ఈ సందర్బంగా హరీశ్ రావు తెలిపారు. వరంగల్ లో హెల్త్ సిటీ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టామన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Harish Rao in Warangal: దసరా నాటికి..

వరంగల్ తో పాటు, ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) 2000 పడకల ఆసుపత్రికి శ్రీకారం చుట్టారని హరీశ్ రావు (Harish Rao) తెలిపారు. మొత్తం 16.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో 24 అంతస్తుల్లో ఈ నిర్మాణం జరుగుతోందని వివరించారు. హెల్త్ సిటీ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, వాటిని పరిశీలించామని వెల్లడించారు. ఈ దసరా నాటికి భవన నిర్మాణం పూర్తి అయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బి, ఏజెన్సీ, వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించామని తెలిపారు. ఈ వరంగల్ హెల్త్ సిటీ చారిత్రాత్మక భవనంగా నిలుస్తుందన్నారు.

Harish Rao in Warangal: 216 ఎకరాల్లో..

216 ఎకరాల్లో ఈహెల్త్ సిటీ రూపుదిద్దుకుంటోందని హరీశ్ రావు (Minister Harish Rao) తెలిపారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు ఇక్కడ అందబోతున్నాయని, అవయవమార్పిడి ఆపరేషన్లు కూడా ఇక్కడ అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ ను అంతగా అభివృద్ధి చేయాలని సీఎం భావిస్తున్నారన్నారు. ఎంబీబీఎస్ (MBBS) సీట్లలో తెలంగాణ (telangana) నెంబర్ వన్ పొజిషన్ లో ఉందని, పీజీ సీట్లలో రెండో స్థానంలో ఉందని హరీశ్ రావు వెల్లడించారు. మెడికల్ చదువు కోసం మన పిల్లలు ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కృషి చేస్తున్నామన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి మెడికల్ విద్య విషయంలో అన్యాయం జరిగిందన్నారు.

Harish Rao in Warangal: రాజకీయ విమర్శలు

రాజకీయాల కోసం కొందరు విమర్శలు చేస్తారని, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు (kaleshwaram project)పై కూడా విమర్శలు చేశారని గుర్తు చేశారు. ఆ విమర్శలు చేసిన వాళ్లే ఇవాళ నోరెళ్లబెడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ‘నేను రానుబిడ్డో సర్కారు దవాఖనకు అనే వారు...ఇప్పుడు నేను పోత బిడ్డో సర్కార్ దవాఖనకు అంటున్నారు’ అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ అమలు చేస్తున్న పథకాలకు దేశవ్యాప్తంగా మంచిపేరు వస్తోందన్నారు. తెలంగాణలో ప్రారంభించిన కంటి వెలుగు పథకానికి మంచి స్పందన వస్తోందని, ఢిల్లీ పంజాబ్ ల్లో ‘కంటి వెలుగు’ ను ప్రారంభిస్తామని ఆప్ చెబుతోందని హరీశ్ రావు వెల్లడించారు. వరంగల్ లో హెల్త్ సిటీ నిర్మాణాన్ని కూడా విమర్శిస్తున్నారని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కామెంట్ చేశారు. పేద వాళ్లు పెద్ద భవనాల్లో చదువుకోవద్దా? అని ప్రశ్నించారు.

IPL_Entry_Point