BRS Harish Rao: ఉన్న మాటంటే ఉలుకెందుకన్న హరీష్ రావు-harish rao questioned whether there was a mistake in what he said inhis speech ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Harish Rao Questioned Whether There Was A Mistake In What He Said Inhis Speech

BRS Harish Rao: ఉన్న మాటంటే ఉలుకెందుకన్న హరీష్ రావు

HT Telugu Desk HT Telugu
Apr 17, 2023 03:41 PM IST

BRS Harish Rao: ఆంధ‌్రప్రదేశ్‌ విషయంలో ఉన్న మాట చెబితే అక్కడి నాయకులు ఎగిరెగిరి పడుతున్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి ఉందో చెప్పాలన్నారు.

మీడియా సమావేశంలో హరీష్ రావు
మీడియా సమావేశంలో హరీష్ రావు

BRS Harish Rao: ఆంధ్రాలో కొందరు నాయకులు ఎగిరెగిరి పడుతున్నారని మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. ఉన్న మాటంటే ఉలిక్కి పడుతున్నారని బిఆర్‌ఎస్‌ ఆత్మీయ సమావేశంలో ఆరోపించారు. ఏపీలో నాయకులు ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. విశాఖ ఉక్కు కోసం ఎందుకు పోరాటం చేయట్లేదన్నారు. పోలవరం పనులు ఎందుకు కావడం లేదని అన్నానని ఇందులో ఏమైనా తప్పుందా అని హరీష్ రావు ప్రశ్నించారు.

ట్రెండింగ్ వార్తలు

తాను ప్రజల పక్షాన మాట్లాడాను తప్ప.. ఏపీ గురించి తప్పుగా మాట్లాడలేదన్నారు. తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ మా బిడ్డలే అని చెప్పానని, ఏపి ప్రజలు ఇక్కడ సెటిల్ అయితే చల్లగా ఉండండి, బాగుండాలి అని చెప్పానని, ఏపీ గురించి ఏనాడూ తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు.

తెలంగాణలో అన్ని బాగున్నాయి ఇక్కడే ఉండండి అని ఆ ఆరోజు అన్నానని హరీష్ రావు చెప్పారు. ఆంధ్రా ప్రజల్ని, ఏపీని కించ పరిచే విధంగా మాట్లాడానని కొందరు నాయకులు మాట్లాడుతున్నారని, అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నానని చెప్పారు.

అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్నారు. చేతనైతే జాతీయ హోదా కోసం పోరాడాలని, విశాఖ ఉక్కు కోసం పోరాటాలు చేయాలని, పోలవరం తొందరగా పూర్తి చేసి కాలేశ్వరం లాగా నీళ్లు అందించాలన్నారు.

గత వారం హరీష్‌ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురైంది. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, బొత్స, సీదిరి అప్పలరాజు వంటి నాయకులుహరీష్‌ రావుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఉన్న ఓట్లను రద్దు చేసుకుని తెలంగాణలో కొనసాగాలని హరీష్‌ రావు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల లేమిని హరీష్‌ లేవనెత్తారు. అభివృద్ధిలో ఏపీ కంటే తెలంగాణ మెరుగైన స్థానంలో ఉందని, విభజన హామీల విషయంలో అధికార పార్టీ సరిగా స్పందించడం లేదని హరీష్ ఆరోపించారు.

సిద్దిపేట జిల్లా ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడి మంత్రి హరీష్ రావు.. ఆంధ్యప్రదేశ్ మంత్రులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తను ఏపీ ప్రజలు, మంత్రులను ఉద్దేశించి తప్పుగా మాట్లాడింది ఏమీ లేదని.. ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారో అర్థం కావట్లేదని హరీష్ అన్నారు. వాస్తవాలు మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు.. తను ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు విషయంలో ఏపీ ప్రజల తరుపు మాట్లాడితే ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు.

ఉమ్మడిగా ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోవద్దంటూ, విడిపోయాక ప్రత్యేక హోదా కావాలంటూ ఉద్యమించిన నాయకులు.. ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని ఏపీ మంత్రులను హరీష్ రావు కోరారు. విశాఖ హోదా కోసం ఎందుకు పోరాడట్లేదని.. పోలవరం ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తి కావట్లేదని మంత్రులను నిలదీశారు. పక్క రాష్ట్రాలతో పోల్చుకునే హక్కు తమకు ఉందని.. దానికే విమర్శించడం సరికాదని హరీష్ రావు మండి పడ్డారు.

ఏపీ రాష్ట్రంలోకంటే తెలంగాణలో పథకాలు బాగున్నాయి. ఆ విషయాన్నే మాట్లాడానని అంతే కానీ ఎవరినీ కించపరచలేదని హరీష్ రావు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి పాటుపడ్డ ప్రతీ ఒక్కరు తెలంగాణ బిడ్డలే అని హరీష్ రావు వెల్లడించారు. ఏపీ నాయకులకు చేతనైతే పోలవరాన్ని పూర్తి చేసి, కాళేశ్వరం లాగా పంటలకు నీళ్లు అందించాలన్నారు.

WhatsApp channel