Telangana Assembly : పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారు : హరీష్ రావు-harish rao gives clarity on boycott of cm speech in assembly ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Assembly : పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారు : హరీష్ రావు

Telangana Assembly : పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారు : హరీష్ రావు

Telangana Assembly : కేసీఆర్‌పై సీఎం రేవంత్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. అందుకే ప్రసంగాన్ని బహిష్కరించామని హరీష్‌ రావు స్పష్టం చేశారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ ఈ కామెంట్స్ చేశారు.

హరీష్‌ రావు

పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారని.. మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు అని స్పష్టం చేశారు. అందుకే సీఎం స్పీచ్‌ను బహిష్కరించామని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారన్న హరీష్.. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నిర్లక్ష్యం..

'కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల 299 టీఎంసీల నీటి పంపకాలు చేశారు. 299 టీఎంసీల నీటి వినియోగం కంటే ఎక్కువ ప్రాజెక్టులు లేవు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి.. 299 టీఎంసీల నీరు తాత్కాలికంగా కేటాయించారు. ప్రాజెక్టులు కట్టని పాపం కాంగ్రెస్‌దే. ఢిల్లీకి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ వెళ్లి ఎందుకు ఒప్పుకొని వచ్చారు. పొతిరెడ్డిపాడు కోసం పీజేఆర్ కొట్లాడాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవుల కోసం పెదవులు మూసుకున్నారు' అని హరీష్ రావు విమర్శించారు.

మంత్రి వదవులు వదులుకున్నాం..

'తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్క రోజు కూడా వ్యతిరేకించలేదు.. 40 రోజులు అసెంబ్లీని స్థంభింపచేశాం. తెలంగాణ కోసం మేము ఆ రోజు 6 మంత్రి పదవులు వదులుకున్నాం. ఉత్తమ్ చంద్రబాబు దగ్గరకు వెళ్లి భోజనం చేసి వచ్చారు. కృష్ణ నీటిలో తెలంగాణకు అన్యాయం చేశారు. ఆ తర్వాత శ్రీశైలం ఖాళీ చేసే లాగా ద్రోహం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సెక్షన్ 3ని సాధించింది కేసీఆర్. 573 టిఎంసీల నీళ్లు సెక్షన్ 3 ద్వారా తెచ్చింది మేము' అని హరీష్ రావు వివరించారు.

త్యాగ చరిత్ర బీఆర్ఎస్‌ది..

'ద్రోహ చరిత్ర ఉత్తమ్‌ది. త్యాగ చరిత్ర బీఆర్ఎస్‌ది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై స్టే తెచ్చింది బీఆర్ఎస్. నల్గొండలో పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ కారణం.. కృష్ణ నీళ్లను సముద్రంలో కలిపారు. కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు కట్టడం వల్ల ఖమ్మంకి నీళ్లు ఇవ్వగలిగాం. హుజూర్‌నగర్‌ని ముంపునకు గురి చేసి ఆంధ్రాలో మూడో పంటకు నీళ్లు ఇచ్చారు. పులిచింతల నిర్వాసితులకు వందల కోట్ల రూపాయలు ఇచ్చి కాపాడుకున్నాం' అని హరీష్ రావు స్పష్టం చేశారు.

Basani Shiva Kumar

eMail