తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ జరిగింది. హార్డ్ డిస్క్‌లు మాయం అయ్యాయి. రాజ్ భవన్‌లోని సుధర్మ భవన్‌లో 4 హార్డ్‌డిస్క్‌లు చోరీకి గురయ్యాయి. మొదటి అంతస్తులోని రూమ్ నుంచి హార్డ్ డిస్క్‌లను అపహరించారు. సీసీ ఫుటేజ్‌లో సిబ్బంది దీన్ని గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 14న రాత్రి చోరీ జరిగినట్టు నిర్ధారించారు.
చోరీకి పాల్పడిన వ్యక్తి హెల్మెట్ ధరించి కంప్యూటర్ రూమ్‌లోకి వచ్చాడు. ఔట్ సోర్సింగ్ విధానంలో గతంలో పని చేసిన వ్యక్తే చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి.. హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీపై స్పందించారు పోలీసులు. చోరీ చేసిన హార్డ్ డిస్క్‌లో ఎలాంటి కీలక సమాచారం లేదని స్పష్టం చేశారు. చోరీకి సంబంధించిన అసలు విషయం వెల్లడించారు.
గతంలో రాజ్ భవన్‌లో పనిచేసిన శ్రీనివాస్ అనే ఉద్యోగి.. ఓ మహిళా ఉద్యోగి ఫొటోలను మార్ఫింగ్ చేశాడు. ఆ కేసులో శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. అతడిని అప్పటికే సస్పెండ్ చేశారు. బెయిల్‌పై బయటకొచ్చిన శ్రీనివాస్.. హెల్మెట్ ధరించి రాజ్ భవన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తాను వాడిన సిస్టమ్‌లోని మహిళ మార్ఫింగ్ ఫొటోలు ఉన్న హార్డ్ డిస్క్‌ను తీసుకొని వెళ్లిపోయాడు.
రాజ్ భవన్.. నిత్యం భద్రతా సిబ్బంది పహారాలో ఉంటుంది. ప్రధాన గేటు మొదలు.. ప్రతీచోట పోలీస్ సిబ్బంది ఉంటారు. అలాంటి చోటుకి.. గతంలో పనిచేసి.. సస్పెండ్ అయిన వ్యక్తి ఎలా వచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హెల్మెట్ ధరించి వచ్చారని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా చెబుతున్నారు. అంటే అసలు వచ్చింది ఎవరో కూడా సిబ్బందికి తెలియదని స్పష్టమవుతోంది. కనీసం చెకింగ్ లేకుండా వీవీఐపీ ఉండే రాజ్ భవన్‌లోకి ఎలా అనుమతించారన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గతేడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 లోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లోనూ చోరీ జరిగింది. ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో నిందితులను బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు బీహార్‌కి చెందిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్‌గా గుర్తించారు. నిందితుల నుంచి రూ.2.2 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఇలా వీవీఐపీలు ఉండే చోట్ల చోరీలు జరగడం చర్చనీయాంశంగా మారింది.
సంబంధిత కథనం