Half Day Schools : మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్స్.. సమ్మర్ హాలిడేస్ ఎప్పటినుంచంటే..? -half days schools will start from march 15 in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Half Days Schools Will Start From March 15 In Telangana

Half Day Schools : మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్స్.. సమ్మర్ హాలిడేస్ ఎప్పటినుంచంటే..?

HT Telugu Desk HT Telugu
Mar 10, 2023 09:52 AM IST

half day schools in telangana:తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది పాఠశాల విద్యాశాఖ. ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.

మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు,
మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు,

Half Day Schools: ఒంటిపూట బడులపై తెలంగాణ విద్యాశాఖ ప్రకటన చేసింది. మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడి విధానాన్ని అమలుచేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేంందుకు ఒంటిపూట బడులను ప్రారంభించాలని నిర్ణయించింది.

ట్రెండింగ్ వార్తలు

టైమింగ్స్ ఇలా...

మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం అవుతాయి. ఉదయం 07.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యార్థులకు క్లాసులు ఉంటాయి. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని విద్యాశాఖ సూచించింది. ఏప్రిల్‌ 23 నుంచి జూన్‌ 11వ తేదీ వరకు పాఠశాలలకు ఈ ఏడాది వేసవి సెలవులను ఇవ్వనున్నారు.

SSC Exams in Telangana: ఇదిలా ఉంటే... రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 12వ తేదీతో ఎగ్జామ్స్ ముగుస్తాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథమెటిక్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.

మిగిలిన తరగతులకు ఏప్రిల్‌ 12 నుంచి పరీక్షలను ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 1-5 తరగతుల వారికి నాలుగు సబ్జెక్టులే ఉండడంతో వారికి ఏప్రిల్‌ 17తో పరీక్షలు ముగియనున్నాయి. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. అంటే దాదాపు 48 రోజుల పాటు సమ్మర్ హాలీ డేస్ రానున్నాయి. తిరిగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం