Meerpet Murder Case : భార్యను హత్య చేసి.. 'సంక్రాంతికి వస్తున్నాం' టికెట్ బుక్ చేసిన గురుమూర్తి!-gurumurthy booked a movie ticket after murdering his wife in meerpet ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Meerpet Murder Case : భార్యను హత్య చేసి.. 'సంక్రాంతికి వస్తున్నాం' టికెట్ బుక్ చేసిన గురుమూర్తి!

Meerpet Murder Case : భార్యను హత్య చేసి.. 'సంక్రాంతికి వస్తున్నాం' టికెట్ బుక్ చేసిన గురుమూర్తి!

Basani Shiva Kumar HT Telugu
Jan 28, 2025 10:39 AM IST

Meerpet Murder Case : మీర్‌పేట మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా పోలీసుల విచారణలో మరో విషయం వెల్లడైంది. నిందితుడి ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. హత్యకు ముందు. తర్వాత ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకుంటున్నారు.

మీర్‌పేట మర్డర్ కేసు
మీర్‌పేట మర్డర్ కేసు

మీర్‌పేట్ మహిళ హత్య కేసు గురించి షాకింగ్ వివరాలు వెలువడుతూనే ఉన్నాయి. మాజీ సైనికుడు తన భార్యను నరికి, ఆమె శరీర భాగాలను బకెట్‌లో ఎలక్ట్రిక్ హీటర్‌తో ఉడికించాడు. ఆపై ఎముకలను పొడి చేసి.. హత్య నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఇందులో భాగంగానే వాటిని నీటిలో పారేశాడు. ఈ మర్డర్ కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గురుమూర్తికి ఇంకా ఎవరైనా సహకరించారనే అనే కోణంలో విచారణ జరుగుతున్నారు. ఈ నేపథ్యంలో మరో కీలక విషయం వెల్లడైంది.

సినిమా టికెట్లు బుక్..

జిల్లెలగూడలో నివాసం ఉంటున్న గురుమూర్తి.. జనవరి 15న సంక్రాంతి రోజున తన భార్య వెంకట మాధవిని హత్య చేశాడు. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి వెళ్లడానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు అతని స్నేహితుడిని విచారణ కోసం పిలిపించినట్లు సమాచారం. అతనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినట్టు తెలిసింది.

హత్య తర్వాత 8 ఫోన్ కాల్స్..

అటు గురుమూర్తి కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలించారు. తన భార్యను హత్య చేసిన తర్వాత గురుమూర్తి 8 కాల్స్ చేశాడని.. వాటిలో ఒకటి బడంగ్‌పేట్‌లో నివసిస్తున్న తన సోదరికి అని పోలీసులు గుర్తించారు. మిగతా 7 కాల్స్‌పైనా పోలీసులు ఫోకస్ పెట్టారు. హత్యకు ముందు, హత్య తర్వాత అతను ఎవరెవరికి కాల్ చేశాడో వివరాలు సేకరించి, వారిని కూడా విచారణకు పిలుస్తున్నారు.

సినిమా చూసి..

గురుమూర్తి.. కామెడీ థ్రిల్లర్ ‘సూక్ష్మదర్శిని’ సినిమాను ఓటీటీలో చూశాడు. ఆ సినిమా ఉన్నట్టు మాధవిని హత్యచేసి.. ఆధారాలు మాయం చేయాలనుకున్నాడు. డీఎన్ఏ, క్లూస్ టీం నివేదికలు వచ్చిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు మరింత ముందుకు సాగే అవకాశం ఉంది. మరోవైపు శరీర భాగాలను ఉడికించడానితి ఉపయోగించిన బకెట్, పాత్రలు, ఎముకలను రుబ్బుకోవడానికి ఉపయోగించే పరికరాలు, ఇతర వస్తువులను కోర్టులో సాక్ష్యంగా చూపించాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

సూక్ష్మదర్శినిలో ఏముంది..

సూక్ష్మదర్శిని సినిమాలో ఇంట్లో వారి మాట వినకుండా పెళ్లి చేసుకుని.. బాలికను దత్తత తీసుకున్న కూతురిని.. ఆమె తల్లి కొడుకుతో కలిసి హత్య చేస్తుంది. శవాన్ని మాయం చేయడానికి ఇంట్లో చిన్న నీళ్ల ట్యాంకు ఏర్పాటు చేస్తుంది. అందులో యాసిడ్‌, రసాయనాలు కలిపి శవాన్ని ఆ ట్యాంకులో వేస్తారు. యాసిడ్‌, రసాయనాలు శవాన్ని కరిగించి ద్రవంగా మార్చేస్తాయి. ఆ నీటిని వాష్‌ రూమ్‌ ద్వారా ఫ్లష్‌ చేసేస్తారు. కరిగిపోని ఎముకలను చిన్న చిన్న ముక్కలుగా చేసి.. ఆ తర్వాత పొడి చేసి ఫ్లష్‌ ద్వారా డ్రైనేజీలోకి వదిలేస్తారు. గురుమూర్తి కూడా ఇలాగే ప్లాన్ చేశాడు. కానీ దొరికిపోయాడు.

Whats_app_banner

సంబంధిత కథనం