గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం- బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు-gulzar house fire tragedy central state govt announces compensation for affected families ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం- బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం- బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం మృతుల బంధువులకు పరిహారం ప్రకటించింది.

గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం- బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

హైదరాబాద్ గుల్జార్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

రూ.5 లక్షల పరిహారం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, దామోదర్‌ రాజనర్సింహా ఘటనాస్థలిని పరిశీలించారు. మృతులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఉదయం నుంచి సీఎం పర్యవేక్షణ

ఈ ప్రమాదంపై అన్ని శాఖల అధికారులతో చరిస్తూ ఎప్పటికప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారన్నారు.

ఆదివారం ఉదయం 6.16 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి ప్రమాదం గురించి సమాచారం వచ్చిందని చెప్పారు.

బాధితులకు అండగా..

అగ్నిమాపక సిబ్బంది 6.20గంటలకు ప్రమాదస్థలికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈక్రమంలో మొత్తం 11 ఫైర్‌ ఇంజిన్లతోపాటు ఒక రోబోను ఉపయోగించామన్నారు.

70 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయకార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పారు. ఈ ప్రమాదం అత్యంత దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

కేంద్రం ఎక్స్ గ్రేషియా ప్రకటన

హైదరాబాద్ అగ్నిప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం కూడా పరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ రూ.2 లక్షల పరిహారం ప్రకటిం

"హైదరాబాద్ నగరంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టం తీవ్ర ఆవేదన కలిగించింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మృతుల బంధువులకు పీఎంఎన్ ఆర్ ఎఫ్ నుంచి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 అందజేస్తాం"- ప్రధాని మోదీ

సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

హైదరాబాద్​ ఓల్డ్ సిటీ మీర్ చౌక్ లోని గుల్జార్‌ హౌస్‌ వద్ద జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి, ఉన్నతాధికారులను ఆదేశించారు.

పోలీస్​, ఫైర్​ విభాగం చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి సరైన వైద్య సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

స్థానిక కుటుంబాలతో కూడా ఫోన్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి బాధితులను కాపాడుతామని భరోసా ఇచ్చారు. దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఐజీ నాగిరెడ్డి ఆదేశించారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం