TS TET Exam 2023 : 15న టెట్ ఎగ్జామ్… అభ్యర్థులు పాటించాల్సిన సూచనలివే
TS TET Exam 2023: ఈనెల 15వ తేదీన టెట్ పరీక్షను నిర్వహించనుంది విద్యాశాఖ. ఇప్పటికే హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకురాగా… అభ్యర్థులకు పలు సూచనలు చేసింది.
TS TET Exam 2023 Updates : తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నడుస్తోంది. అయితే డీఎస్పీ(TRT) నోటిఫికేషన్ రాగా… సెప్టెంబర్ 15వ తేదీన టెట్ పరీక్ష నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. టెట్ ఎగ్జామ్ కు సంబంధించి పూర్తి షెడ్యూల్ ను ప్రకటించగా... ఇవాళ హాల్ టికెట్లను వెబ్ సైట్ లో ఉంచింది విద్యాశాఖ. ఈనెల 15వ తేదీన ఎగ్జామ్ ఉండగా… 27వ తేదీన ఫలితాలను ప్రకటించనుంది. అయితే ఈ పరీక్షకు సంబంధించిన పలు సూచనలు చేసింది విద్యాశాఖ. పరీక్షా కేంద్రం చిరునామాను ఒకరోజు ముందుగానే చూసుకోవాలని సూచించింది.
ట్రెండింగ్ వార్తలు
ముఖ్య సూచనలు:
- పరీక్ష కేంద్రంలోకి హాల్ టికెట్ తప్పనిసరి. ఇతర వస్తువులు తీసుకురావొద్దు.
- హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత పూర్తి వివరాలను సరిచూసుకోవాలి.
- హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం సరిగ్గా లేకపోతే అభ్యర్థులు... ఫొటోను అతికించి గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకొని, ఆధార్ కార్డు, ఇతర ఐడీతో సంబంధిత జిల్లా డీఈవోను సంప్రదించాలి. డీఈవో పర్మిషన్ అనంతరమే పరీక్షకు అనుమతించడంలో తగు నిర్ణయం తీసుకుంటారు.
- గంట ముందు నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
- పేరులో స్వల్ప అక్షర దోషాలు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, జెండర్, డిసేబిలిటీ వంటి వివరాలు సరిగా లేకుంటే పరీక్ష హాలులో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలి.
- తొలి పేపర్ ఎగ్జామ్ కు సంబంధించి మధ్యాహ్నం 12 తర్వాత మాత్రమే బయటికి పంపిస్తారు. సాయంత్రం పరీక్షకు సంబంధించి 5 తర్వాత మాత్రమే ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి అనుమతిస్తారు.
- ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.
- పరీక్ష కేంద్రంలో ఇబ్బందులు సృష్టిస్తే అలాంటి అభ్యర్థులపై చర్యలు తీసుకుంటారు.
సెప్టెంబర్ 15న టెట్ పేపర్1, పేపర్2 పరీక్షలను నిర్వహించనున్నారు. తుది ఫలితాలను సెప్టెంబర్ 27న విడుదల చేస్తారు. సెప్టెంబర్ 15న నిర్వహించే టెట్ పేపర్ 1 పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ -2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 2,83,620 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో పేపర్-1 కు 80,990.. పేపర్-2కు 20,370 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు. మొత్తం రెండు పేపర్లకు కలిపి 1,82,260 దరఖాస్తులు వచ్చాయని ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే నెల సెప్టెంబర్ 15వ తేదీన పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.
హాల్ టికెట్లు ఇలా పొందండి…
అభ్యర్థులు మొదటగా https://tstet.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
'డౌన్లోడ్ Hall Tickets 2023 అనే ఆప్షన్ పై నొక్కండి.
మీ వివరాలను ఎంట్రీ చేయాలి.
మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి. భవిష్యత్ అవసరాల రీత్యా భద్రంగా ఉంచుకోవటం మంచిది.