ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. వచ్చే ఏడాది నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందుకోసం ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న ఆయా నియోజకవర్గాలకు చెందిన అర్హత కలిగిన ఓటర్లు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఈ గడువు దగ్గరపడింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియ ఇవాళ్టితో( నవంబర్ 6) తేదీతో పూర్తి కానుంది. మరికొద్ది గంటలే మాత్రమే గడువు ఉంది. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు సూచిస్తున్నారు. ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పెంచాలని పలు రాజకీయ పార్టీలతో పాటు గ్రాడ్యుయేట్స్ ఈసీని కోరుతున్నారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం