TG Govt Jobs 2024 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 106 ఖాళీలు - భారీగా వేతనం, కేవలం ఇంటర్వూనే..!-government medical college mahabubabad notification recruitment for faculty posts 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Jobs 2024 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 106 ఖాళీలు - భారీగా వేతనం, కేవలం ఇంటర్వూనే..!

TG Govt Jobs 2024 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 106 ఖాళీలు - భారీగా వేతనం, కేవలం ఇంటర్వూనే..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 14, 2024 10:35 AM IST

ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి మహబూబాబాద్‌లోని మెడికల్ కాలేజీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 106 ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో వీటిని రిక్రూట్ చేయనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీతో దరఖాస్తుల గడువు పూర్తి అవుతుంది. ఇంటర్వూల ఆధారంగా తుది జాబితాను ప్రకటించనున్నారు.

మహబూబాబాద్‌ మెడికల్  కాలేజీలో పోస్టుల భర్తీ
మహబూబాబాద్‌ మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీ (image source http://gmcmahabubabad.org/ )

మహబూబాబాద్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా ప్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, ట్యూటర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అన్ని పోస్టులు కలిపి 106 ఉన్నాయి. ఇందులో ఎక్కువగా సీనియర్ రెసిడెంట్లు 49 ఉండగా.. ట్యూటర్ పోస్టులు 26 ఉన్నాయి.

ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్, ఎండీ లేదా, డీఎన్‌బీ, ఎంఎస్ చేసి ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి. ట్యూటర్ పోస్టులకు ఎంబీబీఎస్ చేస్తే సరిపోతుంది. ప్రొఫెసర్ పోస్టులకు ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సెలిల్ తప్పనిసరిగా రిజిస్ట్రర్ చేసుకుని ఉండాలి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 69 ఏళ్లు(31-08-2024నాటికి) మించకూడదు. ఎంపికైన వారిలో ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,90,000 జీతం చెల్లిస్తారు. అసోసియేట్ ప్రొఫెసర్ అభ్యర్థులకు రూ.1,50,000, అసిస్టెంట్ ప్రొఫెసర్ - రూ.1,25,000, సీనియర్ రెసిడెంట్ అభ్యర్థులకు రూ.92,575 జీతం ఉంటుంది. ఇక ట్యూటర్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.55,000 ఇస్తారు. విద్యార్హతల్లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఇంటర్య్వూ, అనుభవం ఆధారంగా జాబితాను ప్రకటిస్తారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా 19 విభాగాల్లోని 106 పోస్టులను భర్తీ చేస్తారు. సెప్టెంబర్ 17వ తేదీన ఇంటర్వూ ఉంటుంది. ప్రిన్సిపల్ ఆఫీస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహబూబాబాద్ లో ఇవి జరుగుతాయి. ఒరిజినల్ ధ్రువపత్రాలతో అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుంది.లోకల్ అభ్యర్థులకు రిజర్వేషన్లను వర్తింపజేస్తారు. ఎంపికైన అభ్యర్థులు బాండ్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు :

  • ప్రొఫెసర్ - 5 ఖాళీలు
  • అసోసియేట్ ప్రొఫెసర్ - 07.
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ - 19.
  • సీనియర్ రెసిడెంట్ - 49.
  • ట్యూటర్ - 26.

సింగరేణిలో ఉద్యోగాలు:

పలు రకాల ఉద్యోగాల భర్తీకి సింగరేణి సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా 21 మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 18వ తేదీతో పూర్తి అవుతుందని ప్రకటించింది.

మెడికల్ స్పెషలిస్ట్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఏడాది కాలపరిమితి ఉంటుందని సింగరేణి సంస్థ తెలిపింది. అర్హతలు ఉన్న అభ్యర్థులకు కేవలం ఇంటర్వూ ద్వారానే రిక్రూట్ చేయనున్నారు. అభ్యర్థుల వయసు 64 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 1,25,000 చెల్లిస్తారు. సెప్టెంబర్ 21వ తేదీన ఇంటర్వూలు ఉంటాయి. https://scclmines.com వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

  • ఉద్యోగ ప్రకటన - సింగరేణి సంస్థ, తెలంగాణ రాష్ట్రం
  • ఉద్యోగ ఖాళీలు - 21 (మెడికల్ స్పెషలిస్ట్)
  • వయోపరిమితి - 64 ఏళ్ల లోపు ఉండాలి.
  • అర్హతలు - వైద్య విద్యలో డిగ్రీతో పాటు పీజీ పూర్తి చేసి ఉండాలి, పని చేసిన అనుభవం కూడా ఉండాలి. పూర్తి స్థాయి నోటిఫికేషన్ లో వివరాలను చూడొచ్చు.
  • దరఖాస్తులు - ఆన్ లైన్ విధానం
  • దరఖాస్తుల ప్రక్రియకు తుది గడువు - 18 , సెప్టెంబర్, 2024.
  • ఎంపిక విధానం - ఇంటర్వూ
  • ఇంటర్వూలు జరిగే ప్రదేశం - S.C.C.L. హెడ్ ఆఫీస్, కొత్తగూడెం, తెలంగాణ రాష్ట్రం.
  • అధికారిక వెబ్ సైట్ - . https://scclmines.com/
  • అప్లికేషన్ లింక్ - https://scclmines.com/032024/olApplication.aspx

టాపిక్