TG Ration Cards: రేషన్ కార్డులపై శుభవార్త.. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో త్వరలోనే విడుదల
TG Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల జారీ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో త్వరలో రేషన్ కార్డుల జారీ చేపట్టాలని సీఎస్ జిల్లా అధికారుల్ని ఆదేశించారు.
TG Ration Cards: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారుల్ని ఆదేశించారు. కలెక్టర్లతో జరిగిన సమీక్షలో రేషన్ కార్డుల జారీపై సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ చేపట్టాలని సూచించారు.
రాష్ట్రంలో త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభం అవుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయం, గృహ, పారిశ్రామిక రంగాలకు నిరంతర విద్యుత్ సరఫరా జరి గేలా ప్రతిరోజూ సమీక్షించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
విద్యుత్ సరఫరా, తాగునీరు, రబీ పంటలు, రైతు భరోసా, రేషన్కార్డుల జారీపై సచివాలయం నుంచి కలెక్టర్లతో మంగళవారం సీఎస్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణలో డిమాండ్‌కు అనుగుణంగా తగినంత విద్యుత్ లభ్యత ఉందని, తాగునీటి సరఫరా, ఆసుపత్రులు కీలక మౌలిక సదుపాయాలకు నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా ప్రాధాన్యమివ్వాలని సీఎస్ సూచించారు.
తెలంగాణ వ్యాప్తం అన్ని జిల్లాల కలెక్టర్లు విద్యుత్ సబ్ స్టేషన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని రిజర్వాయర్లలో గత సంవత్సరం కంటే నీరు ఎక్కువగా ఉందని చెప్పారు. రబీ పంటలకు నీరందేలా సరైన పర్య వేక్షణ ఉండేలా చూసుకోవాలని సీఎస్ సూచించారు.
తెలంగాణలో విద్యుత్ గరిష్ఠ డిమాండ్ గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉందని, నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ నంబర్ 1912పై ప్రచారం చేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.
సంబంధిత కథనం