TG Ration Card Updates : రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్, ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ-ఉగాది నాడు శ్రీకారం-good news for tg ration card holders distribution of rice from april starting on ugadi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Ration Card Updates : రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్, ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ-ఉగాది నాడు శ్రీకారం

TG Ration Card Updates : రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్, ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ-ఉగాది నాడు శ్రీకారం

TG Ration Card Updates : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మార్చి 30న ఉగాది నాడు రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. హుజుర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఏప్రిల్ నుంచి పంపిణీ చేయనున్నారు.

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్, ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ-ఉగాది నాడు శ్రీకారం

TG Ration Card Updates : రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 30న ఉగాది రోజు నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మార్చి 30న హుజుర్ నగర్ లో సన్నబియ్యం పంపిణీ సీఎం చేతుల మీదుగా జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ నెల నుంచి రేషన్ కార్డుదారులకు 6 కేజీలు సన్న బియ్యం అందిస్తామని ప్రకటించారు. తెలంగాణలో 84 శాతం మందికి సన్న బియ్యం అందుతాయని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారన్నారు.

కృష్ణా జలాల్లో నీటి కొరత ఉండటం వాస్తవమేనని మంత్రి ఉత్తమ్ తెలిపారు. శ్రీశైలం నుంచి కరెంట్ తయారుకు నీటిని విడుదల చేసి వాటిని సాగర్ ప్రాజెక్ట్లోకి విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. దీంతో కొంత మేర నీటి కొరత తగ్గుతుందని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఒక్క ఎకరం ఎండినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి అన్నారు. బోర్ల కింద పంటలు ఎండితే మాత్రం ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. ఈ ఎండాకాలంలో వరి ఎంత వేయాలో రైతులకు తెలుసన్నారు. ప్రాజెక్టుల కింద వరి పంటలకు సాగు నీరు అందేలా చూసేందుకు వారానికోసారి సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు.

త్వరలోనే కొత్త రేషన్ కార్డులు -మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. గత పదేళ్లుగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 26న సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల జారీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. తాజాగా కొత్త రేషన్ కార్డులపై మంత్రి పొన్నం ప్రభాకర్ అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు.

ఉగాది నుంచి సన్న బియ్యం

ఉగాది నుంచి రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ మొదలు కాబోతుందని చెప్పారు. హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...నల్గొండలో సన్నబియ్యం ఇచ్చే పథకాన్ని ఈ నెల 30న ప్రారంభించనున్నట్లు చెప్పారు. రేషన్ కార్డులు ఉన్నవారికి సన్నబియ్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు.

వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలని అధికారులను ఆదేశించారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం