హైదరాబాద్ లో కొత్తగా ఇళ్లు కడుతున్నారా..? ఇక ఈజీగా 'వాటర్‌ ఫీజిబిలిటీ సర్టిఫికెట్‌', ఇలా అప్లయ్ చేసుకోండి-good news for hyderabad residents can now apply for water feasibility certificate hmwssb online ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైదరాబాద్ లో కొత్తగా ఇళ్లు కడుతున్నారా..? ఇక ఈజీగా 'వాటర్‌ ఫీజిబిలిటీ సర్టిఫికెట్‌', ఇలా అప్లయ్ చేసుకోండి

హైదరాబాద్ లో కొత్తగా ఇళ్లు కడుతున్నారా..? ఇక ఈజీగా 'వాటర్‌ ఫీజిబిలిటీ సర్టిఫికెట్‌', ఇలా అప్లయ్ చేసుకోండి

హైదరాబాద్ నగర పరిధిలో నూతన భవన నిర్మాణదారులకు జలమండలి శుభవార్త చెప్పింది. ఇక ఆన్‌లైన్‌ లోనే వాటర్‌ ఫీజిబిలిటీ సర్టిఫికెట్‌ తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు పోర్టల్ లో ప్రత్యేక ఆప్షన్ ను తీసుకొచ్చింది.

హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్

హైదరాబాద్ నగర పరిధిలో కొత్తగా ఇంటిని నిర్మిస్తున్నారా..? అయితే మీకు జలమండలి గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఆన్ లైన్ లోనే వాటర్ ఫీజిబిలిటీ ధ్రువపత్రం పొందే సేవలను ప్రారంభించింది. దీంతో నూతన భవన నిర్మాణదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నూతన భవనం నిర్మించాలంటే జీహెచ్ఎంసీ పర్మిషన్ తప్పనిసరి. ఆ పర్మిషన్ కోసం భవన యజమానులు విద్యుత్ ఫీజిబిలిటీ తో పాటు జలమండలి జారీ చేసే వాటర్ ఫీజిబిలిటీ ధ్రువపత్రం సమర్పించాలి.

గతంలో ఈ సర్టిఫికెట్స్ పొందాలంటే జలమండలి సర్కిల్ కార్యాలయాల్లో, తర్వాత ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో సీజీఎం జారీ చేసేవారు. వివిధ కారణాల రీత్యా ఈ ప్రక్రియలో జాప్యం జరిగేది. దీన్ని నివారించి, ఆ ప్రక్రియను సులభతరం చేయడానికి ధ్రువపత్రాల జారీని ఆన్‌లైన్‌ లోనే పొందేలాగా మార్పులు చేశారు.

అప్లికేషన్ ప్రాసెస్ ఇలా….

  • కొత్త భవనం నిర్మించేవాళ్లు https://www.hyderabadwater.gov.in/en/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని “Apply Online for Water Feasibility Certificate” అనే లింక్ అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు సమర్పించిన వెంటనే ఫైల్ నంబర్ రూపొందించబడుతుంది.
  • అవసరమైన పత్రాలను దరఖాస్తు సమయంలోనే అప్‌లోడ్ చేయాలి.
  • ప్రాసెసింగ్ ఫీజు కింద ఒక్కో దరఖాస్తుపై రూ. 5,000 ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాలి.
  • ఫైల్ సంబంధిత సీజీఎంకి పంపబడుతుంది. ఆయా వివరాలు మొబైల్ యాప్‌లో మరియు చెక్లిస్ట్‌తో పాటు సిస్టమ్ స్క్రీన్‌లో అప్‌డేట్ చేస్తారు.
  • ఫిజిబిలిటీ పూర్తి అయిన తరువాత సీజీఎం, అవసరమైతే సిఫార్సులతో కూడిన ఫైల్‌ను అవుట్‌ వార్డ్ చేస్తారు.
  • ఈడీ/ రెవిన్యూ డైరెక్టర్ మరియు సీజీఎం (రెవిన్యూ)లతో కూడిన కమిటీ వారానికొకసారి ఫైళ్లను సమీక్షించి ఆమోదిస్తుంది.
  • కమిటీ ఆమోదం తరువాత ఫిజిబిలిటీ సర్టిఫికేట్ చార్జీల అంచనాను సీజీఎం (రెవెన్యూ ) తయారు చేస్తారు.
  • పౌరునికి SMS ద్వారా ఛార్జీల వివరాలు పంపబడతాయి. పౌరుడు 30 రోజుల్లోగా ఆన్‌లైన్ / నగదు కౌంటర్ ద్వారా చెల్లించాలి.
  • కనెక్షన్ ఛార్జీలు అందిన ఫైళ్లకు SMS నోటిఫికేషన్ ఆధారంగా సీజీఎం (రెవెన్యూ) డిజిటల్ సంతకంతో ఫిజిబిలిటీ సర్టిఫికెట్ జారీ చేస్తారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం