Gold Silver Rate Today: తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్​లో ఎంతంటే-gold and silver rates on 28th september 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Gold And Silver Rates On 28th September 2022

Gold Silver Rate Today: తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్​లో ఎంతంటే

Mahendra Maheshwaram HT Telugu
Sep 28, 2022 08:50 AM IST

Gold and Silver Price today 28 september 2022: కొన్ని రోజులుగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. అయితే మంగళవారం ధరలు స్థిరంగా ఉండగా ... ఇవాళ తగ్గుముఖం పట్టింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 49,970గా నమోదైంది. మరోవైపు ఇవాళ వెండి రేటు తగ్గింది.

బంగారం వెండి ధరలు,
బంగారం వెండి ధరలు,

Gold silver price today 28 september 2022: బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. మంగళవారం ధరల్లో ఎలాంటి మార్పులు లేకుండగా... ఇవాళ దిగివచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారంపై రూ.200 తగ్గగా.. 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం పై కూడా రూ. 230 దిగివచ్చింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 49,970గా నమోదైంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

22 క్యారెట్ల బంగారం రేటు రూ. 45,800 వద్ద కొనసాగుతోంది. ఇక ఇవాళ కిలో వెండిపై రూ. 900 తగ్గి ...హైదరాబాద్ మార్కెట్ కిలో వెండి ధర రూ.60,700గా ఉంది

Gold silver price: ఏపీలో ఇలా…

gold silver prices in ap: విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.45,800గా ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర 49,970గా నమోదైంది. ఇక్కడ వెండి ధర కిలో రూ. 60,700 వద్ద కొనసాగుతోంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970గా ఉంది.

Gold silver price: పలు నగరాల్లో ఇలా..

gold and silver rate in india: దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,290గా ఉంది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,950గా ఉంటే… 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,130 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,850గా ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,020 వద్ద ఉంది. ఇక కోల్ కత్తాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 49,970గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 45,800 వద్ద కొనసాగుతోంది.

Platinum Price today: ప్లాటినం ధరలు ఇలా..

ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 260 చొప్పున తగ్గింది. హైదరాబాద్‌లో ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 22,360గా ఉంది. విజయవాడలో, విశాఖపట్నంలోనూ ప్లాటినం ధర 10 గ్రాములకు రూ. 23,360గా ఉంది.

ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉన్నాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనే రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం