సికింద్రాబాద్ లో దారుణం - బాలికపై డ్రైవర్ అత్యాచారం..!-girl raped by a driver at tukaram gate in secunderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  సికింద్రాబాద్ లో దారుణం - బాలికపై డ్రైవర్ అత్యాచారం..!

సికింద్రాబాద్ లో దారుణం - బాలికపై డ్రైవర్ అత్యాచారం..!

Girl Raped by a Driver in Hyderabad: సికింద్రాబాద్​లోని తుకారం గేట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో దారుణం జరిగింది. మాయమాటలు చెప్పిన ఓ టూ వీలర్ క్యాబ్ డ్రైవర్…. బాలికపై అత్యాచారం చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

representative image (photo source unshplash.com)

హైదరాబాద్ నగరంలో దారుణం వెలుగు చూసింది. కుటుంబ సభ్యులతో గొడవపడి బయటికి వచ్చిన ఓ బాలికపై.. ఓ టూ వీలర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సికింద్రాబాద్ లోని తుకారం గేట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో వెలుగు చూసింది.

ఏం జరిగిందంటే…?

పోలీసులు ప్రాథమిక వివరాల ప్రకారం…. తుకారం గేట్​ పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. వీరికి 16 ఏళ్ల కుమార్తె ఉంది. అయితే ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతుందని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మే 19వ తేదీన సదరు బాలిక ఇంట్లో నుంచి అలిగి బయటికి వచ్చేసింది. ఇదే విషయంపై తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు కింద ఫిర్యాదు కూడా ఇచ్చారు. 

సదరు బాలిక ఓ టూవీలర్ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్న సందీప్ రెడ్డి(27) కంట పడింది. విధుల్లో ఉన్న సమయంలో కనిపించటంతో ఆమె వద్దకు వెళ్లాడు.  ఒంటరిగా ఉండటాన్ని ఆసరాగా తీసుకున్న అతగాడు… మాటమాట కలిపి నమ్మించే ప్రయత్నం చేశాడు. అంతేకాదు… తన బురిడీ మాటలతో ఆ బాలికను వాహనంపై ఎక్కించుకున్నాడు. 

నగరంలోని పలు ప్రాంతాల్లో తిప్పిన అనంతరం ఓ లాడ్జీకి తీసుకెళ్లాడు.  అక్కడ అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాదు… విషయం బయటికి చెబితే చంపేస్తానని బెదిరించాడు. అక్కడ్నుంచి బయిటికి వచ్చిన బాలిక… నేరుగా ఇంటికి చేరింది. జరిగిన ఘటన గురించి చెప్పింది.

తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న తుకారం గేట్​ పోలీసులు… నిందితుడిని పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

స్పందించిన  ర్యాపిడో - సమాధానం ఇదే

ఈ ఘటనపై ర్యాపిడో టూవీలర్ క్యాబ్ యాజమాన్యం స్పందిస్తూ ప్రకటన విడుదల చేసింది. మైనర్ బాలికపై జరిగిన ఘటనతో తీవ్ర ఆందోళనకు గురయ్యామని తెలిపింది. ర్యాపిడో రైడ్ లో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని పేర్కొంది. బాధితురాలు ర్యాపిడో రైడ్ బుకింగ్ చేసుకోలేదని స్పష్టం చేసింది.  ఈ ఘటన జరిగిన సమయంలో నిందితుడు ర్యాపిడో రైడ్ విధుల్లో కూడా లేడని తెలిపింది.