హైదరాబాద్, జూన్ 23: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) గోల్నాకా అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ఒక బిల్లును ప్రాసెస్ చేసి పై అధికారులకు పంపించడానికి అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా రూ. 20,000 లంచం డిమాండ్ చేశారు. బాధితులు ముందుగా రూ. 5,000 అడ్వాన్స్‌గా ఇచ్చారు. మిగతా రూ. 15,000 ఇచ్చే ముందు ఏసీబీని ఆశ్రయించారు.
ఏసీబీ అధికారులు పథకం ప్రకారం మనీషాను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. వెంటనే ఆమెను అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.